మార్కెట్‌కు పచ్చబంగారం

ABN , First Publish Date - 2020-05-28T10:54:42+05:30 IST

కరోనా ప్రభావంతో రెండు నెలలు మూతబడిన మార్కెట్‌ యార్డు ప్రస్తుతం ‘పచ్చ బంగారం’తో కళకళలాడు తోంది.

మార్కెట్‌కు పచ్చబంగారం

జిల్లాకేంద్రంలోని మార్కెట్‌ యార్డులో పసుపు కొనుగోళ్లు ప్రారంభం

మొదటి రోజు క్వింటాలు రూ.4900 నుంచి రూ.6100 వరకు ధర

కరోనా ప్రభావంతో మార్కెట్‌కు ప్రతిరోజూ పది వేల బస్తాలకే అనుమతి


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నిజామాబాద్‌)

కరోనా ప్రభావంతో రెండు నెలలు మూతబడిన మార్కెట్‌ యార్డు ప్రస్తుతం ‘పచ్చ బంగారం’తో కళకళలాడు తోంది. సుమారు రెండు నెలల తర్వాత రైతుల విజ్ఞప్తితో ప్రభుత్వం కొనుగోళ్లకు అనుమతిచ్చింది. దీంతో నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ను అధికారులు బుధవారం ప్రారంభించడంతో రైతులు పసుపు తీసుకువచ్చి అమ్మకాలు చేపట్టారు. ధర కూడా మొదటి రోజు బాగానే వచ్చింది. కాడి, బల్బు రకాల పసుపు నాణ్యమైనది రావడంతో వ్యాపారులు కూడా ముందుకు వచ్చి కొనుగోళ్లు చేశారు. కరోనా ప్రభావం ఉం డడంతో మార్కెట్‌లో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండడంతో ఒకే గేటును తెరిచి ఉంచి క్రయవిక్రయాలను నిర్వహించారు. నిజామాబాద్‌  వ్యవసాయ మార్కెట్‌ తెరవడంతో మొదటి రోజు రైతులు 8 వేల బస్తాలను తీసుకువచ్చారు.


రెండు నెలల తర్వాత మార్కెట్‌ తెరవడంతో పసుపు వ్యాపారులు కూడా ముందుకు వచ్చి కొనుగోళ్లు చేశారు. గతం కంటే భిన్నంగా సమయాన్ని మార్చ డంతో ఉదయం 11 గంటల లోపే ధరను నిర్ణయించారు. ఆ తర్వాత తూకాలను చేశారు. ధర బాగా రావడంతో మొదటి రోజు తీసుకువచ్చిన రైతులందరూ పసుపును అమ్మకాలు చేశారు. రెండు నెలలుగా మార్కెట్‌ లేకపోవడంతో రైతులు పసుపు అమ్మేందుకు తిప్పలు పడ్డారు. గ్రా మాలకు వచ్చే వ్యాపారులకు తక్కువ రేటుకు అమ్మకాల ను చేశారు. పసుపు భారీగా ఉండడంతో కోల్డ్‌ స్టోరేజీల్లో కొందరు నిల్వ చేశారు. ప్రభుత్వం మార్కెట్‌ను తెరవడంతో పాటు ప్రతిరోజూ పదివేల బస్తాలకే అనుమతి ఇవ్వడంతో ఆలోపు వచ్చే వాటినే లోనికి అనుమతిస్తున్నారు. 


కరోనా ప్రభావంతో ప్రత్యేక ఏర్పాట్లు... 

వ్యవసాయ మార్కెట్‌లో కరోనా ప్రభావంతో అందరూ భౌతిక దూరం పాటించే విధంగా చూశారు. మాస్కులు తప్పనిసరి చేశారు. శానిటైజర్‌లను అందుబాటులో ఉంచా రు. మార్కెట్‌కు ఇతరులు వచ్చే అవకాశం ఉండడంతో ఒకే గేటును తెరిచారు. ఆ గేటు గుండానే రాకపోకలకు అవ కాశం ఇచ్చారు. హమాలీలతో పాటు దడ్వాయిలకు తప్పనిసరిగా మాస్కులు కట్టుకునే విధంగా చూశారు. వారందరికీ గుర్తిపు కార్డులను కూడా అందజేస్తున్నారు. కరోనా ఉన్నన్ని రోజులు కట్టడి చేస్తూ కార్డులు ఉన్న వారినే లోనికి అనుమతించే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. 


 7గంటల లోపే తూకం పూర్తి 

మార్కెట్‌కు 8 వేల బస్తాల పసుపు రావడంతో త్వరగా కొనుగోళ్లను అధికారులు పూర్తిచేశారు. ఉదయం 7 గంటల నంచి 9 గంటల మధ్య పసుపు లాట్లకు నెంబర్‌లు ఇచ్చారు. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యన ధర నిర్ణయించేందుకు వ్యాపారులకు అవకాశం ఇచ్చారు. రైతులకు ఇనామ్‌ ద్వారా సమాచారాన్ని అందించారు. వెనువెంటనే తూకాన్ని మొదలుపెట్టి సాయంత్రం 7 లోపు పూర్తిచేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను మార్కెట్‌లో చేశారు. ప్రతీ ప్లాట్‌ఫాంకు ఒక  సూపర్‌వైజర్‌ను పెట్టి త్వరగా పూర్తయ్యే విధంగా  చూశారు.


సాయంత్రం 4 నుంచి 7గంటల వరకే అనుమతులు

ప్రతీరోజు మార్కెట్‌కు పసుపు తీసుకువచ్చేందుకు రైతులకు సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్యనే అను మతులు ఇస్తున్నారు. ఆ తర్వాత వచ్చే వాటికి అనుమతి ఇవ్వడం లేదు. కేవలం 10 వేల బస్తాలకు మాత్రమే ప్రతీరోజు అనుమతులు ఇస్తున్నారు. తీసుకువచ్చే రైతులకు టోకెన్‌లను అందజేస్తున్నారు. హోటళ్లతో పాటు ఇతర వసతులు లేకపోవడం వల్ల త్వరగా పూర్తిచేసేందుకు ఈ నిర్ణయాన్ని మార్కెట్‌ అధికారులు తీసుకున్నా రు. ప్రభుత్వం నుంచి మళ్లీ అనుమతులు వచ్చే వరకు ఇదే రీతిలో కొనసాగించనున్నారు. 


మొదటి రోజు క్వింటాలు రూ.4900 నుంచి రూ.6100 మధ్య ధర

పసుపు మార్కెట్‌లో మొ దటి రోజు కాడి రకానికి క్వింటలు రూ.4912 నుంచి రూ.6100 వరకు ధర పలికింది. కాడి కి మోడల్‌ రేటు రూ. 5600 మధ్యన ఎక్కువ అ మ్మకాలు జరిగాయి. పసుపు నాణ్యంగా ఉండడం పూర్తిగా ఎండ డంతో వ్యాపారులు కూడా ధర పెట్టారు. గోల రకానికి క్వింటాలు రూ.4855 నుంచి రూ.5855 మధ్యన ధర పలికింది. చురా రకానికి క్వింటాలు రూ.4010 నుంచి రూ.5050 వరకు ధర పలికింది. మార్కెట్‌ అధికారులు రెండునెలల తర్వాత ప్రారంభం కావడంతో క్వింటాలు రూ.4500 కన్నా తక్కువ రేటుకు కోట్‌ చేయవద్దని ముందే వ్యాపారులతో సమావేశం నిర్వహించి వారికి వివరించాడంతో మొదటి రోజు తీసుకువచ్చిన రైతులకు ధర బాగా వచ్చింది. రెండు నెలల క్రితం ఎక్కు వ మంది రైతులు ఇంతకంటే తక్కువ ధరకే అమ్మకాలను చేశారు. మొదటి రోజు కావడంతో తక్కువ మంది రైతులు తీసుకువచ్చారు. ఇప్పటి నుంచి ప్రతీరోజు భారీగానే పసుపు తీసుకురానున్నారు. 


అన్ని ఏర్పాట్లు చేశాం..స్వరూపారాణి, కార్యదర్శి 

మార్కెట్‌లో రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశాం. కరోనా ప్రభావం కారణంగా మొదటి రోజు అందరికీ అవగాహక కల్పించడంతో పాటు మాస్కులు ధరించే విధంగా చూశాం. భౌతిక దూరం పాటించే విధంగా చూస్తూనే  ఇతర ఏర్పాట్లను చేశాం. 

Updated Date - 2020-05-28T10:54:42+05:30 IST