చర్చల పేరుతో కాలయాపన చేస్తున్న యాజమాన్యం

ABN , First Publish Date - 2022-08-09T06:05:39+05:30 IST

సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు కనీ స వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌ వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సింగరేణి కాంట్రా క్టు కార్మిక సంఘాల జేఏసీ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది.

చర్చల పేరుతో కాలయాపన చేస్తున్న యాజమాన్యం
లేబర్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న జేఏసీ నాయకులు

- కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు సిద్ధం కండి

- జేఏసీ పిలుపు

గోదావరిఖని, ఆగస్టు 8: సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు కనీ స వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌ వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సింగరేణి కాంట్రా క్టు కార్మిక సంఘాల జేఏసీ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో లేబర్‌ కమిషనర్‌ వద్ద సింగరేణి యాజ మాన్యం కార్మిక సంఘాల మధ్య జరిగిన విఫలమయ్యాయి. దీంతో కార్మిక సంఘాల నాయకులు లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ముం దు ప్ల కార్డులతో నిరసన తెలిపారు. అనంతరం చీఫ్‌ లేబర్‌ కమిష నర్‌ శ్రీనివాస్‌కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్క రించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని, చర్చల పేరుతో జాప్యం చేస్తుందని, కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే సెప్టెంబర్‌ 9 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ నెల 10 నుంచి 20వరకు అన్నీ ఏరియాల్లో కాంట్రాక్టు కార్మికుల నిరసన కార్యక్రమం, 21 నుంచి 30వరకు కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేల క్యాంపుకార్యాల యాల ముట్టడి, సెప్టెంబర్‌ మొదటి వారంలో ఛలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. సింగరేణి యాజమాన్యం ఐక్యంగా పోరాడుతున్న కార్మిక సంఘాలను విచ్ఛిన్నం చేయడానికి కుటిల ప్రయత్నం చేస్తుందని, 9 నుంచి జరిగే నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుత్తుల సత్యనారాయణ, మధు, వెంకన్న, నాగభూ షణం, యాకూబ్‌, కృష్ణయ్య, నాగేశ్వర్‌రావు, మధుసూధన్‌రెడ్డి, ఆంజనే యులు, రవీంద్ర, బ్రహ్మానందం, కోండ్ర మొగిలి, ఉపేందర్‌, మధుసూ దన్‌రెడ్డి, రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T06:05:39+05:30 IST