27 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్న 83 ఏళ్ల వృద్ధుడు.. క్షమాభిక్షకు దరఖాస్తు.. ఇంతకీ ఇతడు చేసిన దారుణమేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-08-04T20:02:52+05:30 IST

అతని వయసు 83 ఏళ్లు.. 27 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు.. బతికి ఉన్నంతకాలం అతడు జైళ్లోనే ఉండాలి..

27 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్న 83 ఏళ్ల వృద్ధుడు.. క్షమాభిక్షకు దరఖాస్తు.. ఇంతకీ ఇతడు చేసిన దారుణమేంటో తెలిస్తే..

అతని వయసు 83 ఏళ్లు.. 27 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు.. బతికి ఉన్నంతకాలం అతడు జైళ్లోనే ఉండాలి.. అయితే ఇప్పుడతను బయటకు రావాలనుకుంటున్నాడు.. చివరి దశలోనైనా స్వేచ్ఛగా గడపాలనుకుంటున్నాడు.. అందుకే రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నాడు.. జైళ్లో ఎంతో సచ్ఛీలుడిగా పేరు తెచ్చుకున్న ఆ వ్యక్తి గతం తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. 


బాబాగా గుర్తింపు సంపాదించుకున్న స్వామీ శ్రద్ధానంద అలియాస్ మురళీ మనోహర్ మిశ్రా 1986లో షకిరే అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఆమె సామాన్యురాలు కాదు.. మైసూర్ రాష్ట్ర మాజీ దివాన్ సర్ మిర్జా ఇస్మాయిల్ మనవరాలు. రూ.600 కోట్ల ఆస్తికి వారసురాలు. అప్పటికే వివాహం చేసుకుని ఒక కూతురికి తల్లి కూడా అయిన షకిరే తన భర్తకు విడాకులు ఇచ్చి శ్రద్ధానందను 1986లో వివాహం చేసుకుంది. 1991 మే నుంచి ఆమె అదృశ్యం అయిపోయింది. దీంతో షకిరె కూతురు, తల్లి పోలీసులకు ఆమె అదృశ్యం గురించి ఫిర్యాదు చేశారు. దాదాపు మూడేళ్ల పాటు ఆ కేసును దర్యాఫ్తు చేసిన పోలీసులు శ్రద్ధానందను నిందితుడిగా గుర్తించారు. 


షికిరెకు కాఫీలో మత్తుమందు కలిపి ఇచ్చి బతికుండగానే ఆమెను ఇంటి పెరట్లో గొయ్యి తీసి పూడ్చేసినట్టు శ్రద్ధానంద కోర్టు ఎదుట అంగీకరించాడు. ఆమె వెనుక ఉన్న రూ.600 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకే ఆమెను చంపినట్టు తెలిపాడు. దీంతో కోర్టు 1994లో అతనికి బతికి ఉన్నంతరకు జైలు శిక్షను విధించింది. 27 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన శ్రద్ధానంద 83 ఏళ్ల వయసులో బయటకు రావలనుకుంటున్నాడు. ఈ మేరకు రాష్ట్రపతికి దరఖాస్తు పెట్టుకున్నాడు. జైలులో తన సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని విడుదల చేయాలని కోరుతున్నాడు. 


Updated Date - 2021-08-04T20:02:52+05:30 IST