Abn logo
Sep 26 2021 @ 00:00AM

శానిటైజర్‌ తాగి వ్యక్తి మృతి

రాజు మృతదేహం

ఎంవీపీకాలనీ, సెప్టెంబరు 26: మద్దిలపాలెం పిఠాపురంకాలనీ బజార్‌ వద్ద ఆదివారం ఓ వ్యక్తి మద్యానికి నగదు లేకపోవడంతో శానిటైజర్‌ సేవించి మృతి చెందాడు. ఎంవీపీకాలనీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తగరపువలసకు చెందిన రాజు పిఠాపురంకాలనీ పరిసర ప్రాంతాల్లో కాగితాలు, ప్లాస్టిక్‌ వస్తువులు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇక్కడే ఉన్న సులాభ్‌ కాంప్లెక్స్‌లో కాలకృత్యాలు తీర్చుకుంటుంటాడు. సులాభ్‌ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న గంటా సంజీవరావుతో తనకు ఎవరూ లేరని రాజు తెలిపినట్టు పోలీసులు తెలిపారు. కాగా ఆదివారం ఉదయం సంజీవరావు సులాభ్‌ కాంప్లెక్స్‌ వద్ద అపస్మారక స్థితిలో పడివున్న రాజును చూసి 108కు కాల్‌ చేశాడు. 108 సిబ్బంది వచ్చి రాజును పరిశీలించి మృతి చెందాడని నిర్ధారించడంతో సంజీవరావు ఎంవీపీకాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలికి వచ్చి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. సంజీవరావును పోలీసులు రాజు గురించి వివరాలు అడగ్గా మద్యానికి నగదు లేక శానిటైజర్‌ సేవించడం చూసినట్టు తెలిపాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.