Secundrabad కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి వరంగల్ వాసిగా గుర్తింపు

ABN , First Publish Date - 2022-06-17T20:12:13+05:30 IST

సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన యువకుడు వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్‌గా రైల్వే అధికారులు గుర్తించారు.

Secundrabad కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి వరంగల్ వాసిగా గుర్తింపు

వరంగల్: సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన యువకుడు వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్‌గా రైల్వే అధికారులు గుర్తించారు. ‘‘అగ్నిపథ్‌’’ను రద్దు చేయాలంటూ ఈరోజు ఉదయం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన విధ్వంసానికి దారి తీసింది. రైల్వేస్టేషన్‌పై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. రాళ్లతో దాడులు చేస్తూ రైళ్లకు నిప్పు పెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. పలువురు యువకులు గాయపడ్డారు. వెంటనే వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా చనిపోయిన వ్యక్తి వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్‌పేటకు చెందిన రాకేష్‌గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు రైల్వే అధికారులు సమాచారం ఇచ్చారు. రాకేష్ తండ్రి కుమారస్వామి, తల్లి పూలమ్మ. వీరికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉంది. ప్రస్తుతం చనిపోయిన రాకేష్ నర్సంపేటలో డిగ్రి పూర్తి చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 


Updated Date - 2022-06-17T20:12:13+05:30 IST