మక్కల కొనుగోళ్లలో గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2020-05-23T10:32:34+05:30 IST

రైతులకు అండగా ఉం టూ వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర తీసుకరా వాల్సిన కొందరు రైతు ప్రజాప్రతినిధులే దళారి

మక్కల కొనుగోళ్లలో గోల్‌మాల్‌

దళారులతో కుమ్మక్కైన పలువురు  రైతు ప్రతినిధులు

రైతులను దగా చేస్తున్న దళారీ ప్రతినిధులు

రైతుల నుంచే తక్కువ ధరకు మక్కల కొనుగోళ్లు

అవే మక్కలు మార్క్‌ఫెడ్‌ కేంద్రాల్లో రైతుల పేరిట విక్రయాలు

గాంధారిలో ఓ పీఏసీఎస్‌ ప్రతినిధి తతంగం

జిల్లాలోని పలు పీఏసీఎస్‌లలోనూ ఇదే పరిస్థితి

సదరు నేతకు సహకరిస్తున్న స్థానిక వ్యవసాయ, సహకార శాఖల సిబ్బంది

జిల్లాలో తీవ్రంగా నష్టపోతున్న మొక్కజొన్న  రైతులు


కామారెడ్డి, మే 22(ఆంధ్రజ్యోతి): రైతులకు అండగా ఉం టూ వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర తీసుకరా వాల్సిన కొందరు రైతు ప్రజాప్రతినిధులే దళారి అవతారం ఎత్తడంపై విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లలో కొందరు రైతు ప్రజాప్రతినిధులు దళారి అవతా రం ఎత్తుతూ రైతులనే తీవ్రంగా నష్టాలకు గురి చేస్తున్నా రు. రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు మక్కలను కొంద రు రైతు ప్రజాప్రతినిధులు దళారుల చేత కొనుగోలు చేసి అవే మక్కలను రైతుల పేరిటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారంటూ పలు ఆరోపణలు వస్తున్నాయి.


గాంధారి మండలంలోని ఓ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని ఓ ప్రజాప్రతినిధి స్థానిక మొక్కజొన్న రైతుల నుంచి మక్కల ను తక్కువ ధరకు దళారుల చేత కొనుగోలు చేయించి వాటన్నింటిని తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయిస్తూ స్థానిక రైతులను మోసం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సదరు రైతు ప్రజా ప్రతినిధికి స్థానికంగా ఉండే వ్యవసాయ, సహకార శాఖల సిబ్బంది సహకారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా గాంధారిలోనే కాకుండా పొరుగు జిల్లాలోని పలు మండ లాల నుంచి మక్కలను తక్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారని దీనిపై ఉన్నతాధికారులు నిఘా పెట్టి సమగ్ర విచారణ జరిపితే అక్రమాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు.


మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మక్కల కొనుగోళ్లు

జిల్లాలో మొక్కజొన్న పంటను రైతులు చాలా విస్తీర్ణం లోనే సాగు చేస్తుంటారు. ఈ రబీ సీజన్‌లో 37,160 ఎకరా ల్లో మొక్కజొన్న పంట సాగైంది. సుమారు 40వేల మెట్రిక్‌ టన్నుల మక్కల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ సందర్భంగా కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకై మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్య ంలో మొక్కజొన్నను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణ యించింది. దీంతో జిల్లాలో గ్రామ గ్రామానా వెళ్లి మక్కల ను కొనుగోలు చేయాలని అధికారులు ప్రణాళికలను రూపొ ందించారు. ప్రతీ ఏటా జిల్లాలో 30 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జిల్లా యంత్రాంగం 103 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న క్వింటాలుకు రూ.1760 మద్దతు ధరకు మార్క్‌ఫెడ్‌ అధికారులు కొనుగో లు చేపడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 500 మంది రైతుల నుంచి 30 వేల మెట్రిక్‌ టన్నులు మొక్కజొ న్నను కొనుగోలు చేశారు. మరో 10వేల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయాల్సి ఉందని మార్క్‌ఫెడ్‌ అధికారులు పేర్కొంటున్నారు.


మొక్కజొన్న కొనుగోళ్లలో అక్రమాలు

జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతు న్నాయి. ప్రతీయేట ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యం లో రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోళ్లు చేస్తున్న విష యం తెలిసిందే. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా గ్రామ గ్రామాన మక్కలను కొనుగో లు చేయాలని నిర్ణయించి గతంలో ఎన్నడూ లేని విధంగా 103 మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.


ఈ కొనుగోలు కేంద్రాలు జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇదే అదునుగా భావించిన జిల్లాలోని పలు పీఏసీ ఎస్‌లలోని కొందరు రైతు ప్రజాప్రతినిధులు మక్కల కొను గోళ్లలో గోల్‌మాల్‌ చేస్తున్నారు. గాంధారి, భిక్కనూరు, పిట్ల ం, పెద్దకొడప్‌గల్‌, బాన్సువాడ, దోమకొండ, కామారెడ్డి, సదా శివనగర్‌ తదితర మండలాల పరిధిలోని కొన్ని పీఏసీఎస్‌లో కొందరు ప్రజాప్రతినిధులే ఇష్టారీతినా కొనుగోళ్ల ను చేపడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మార్క్‌ఫెడ్‌ అధికారులను, ఉన్నతాధికారుల సల హాలు, సూచనలను పాటించకుండానే పీఏసీఎస్‌ ద్వారా కొనుగోలు చేపడుతామంటూ ఆయా గ్రామాల్లో దళారుల చేత రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తున్నారని విమర్శలు వస్తున్నా యి. దళారులతో పలువురు పీఏసీఎస్‌ల రైతు నేతలు కుమ్మకై మక్కల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతూ రైతులను మోసం చేస్తున్నట్లు పలువురు రైతులు మండిపడుతున్నారు.


గాంధారిలో ఇష్టారీతిన కొనుగోళ్లు

జిల్లాలో మొక్కజొన్నకు గాంధారి, పిట్లం మం డలాలు పెద్ద మార్కెట్‌. ఇందులో ఎక్కువగా గాంధారిలోని మొక్కజొన్న సాగు విస్తీర్ణం చాలానే ఉండటమే కాకుండా క్రయ విక్రయాలు సైతం భారీగానే జరుగుతుంటాయి. దళారులు ఈ మం డలాల్లో రైతుల నుంచి మక్కలను తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభాలను గడిస్తుంటారు. అయి తే ఈ సీజన్‌లో కొందరు రైతు ప్రజాప్రతినిధులు దళారులతో కుమ్మకై రైతుల నుంచి మొక్కజొన్న ను తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ప్రణాళి కను ముందుగానే రూపొందించుకున్నారు. అయి తే గాంధారి మండలంలోని ఓ ప్రాథమిక సహకా ర సంఘానికి చెందిన ఓ రైతు ప్రజాప్రతినిధి ఏకంగా దళారి అవతారం ఎత్తి స్థానికంగా ఉండే దళారులు, ప్రైవేట్‌ వ్యక్తులతో కుమ్మకయ్యారు.


మొక్కజొన్నను కొనుగోళ్లు చేసేందుకు మొదట పీఏసీఎస్‌ ద్వారా ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ సద రు రైతు ప్రజాప్రతినిధి స్థానిక పీఏసీఎస్‌ ద్వారా కొనుగోలు చేసేందుకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఐసీడీఎంఎస్‌ ద్వారా కొనుగోళ్లకై మూడు కేంద్రాల ను ఏర్పాటు చేశారు. స్థానికంగా కొందరు దళారు లు, ప్రైవేట్‌ వ్యక్తులు ముందుగానే రైతులకు పంటల సాగుకై డబ్బులు అప్పుగా ఇస్తుంటారు. అయితే పంట చేతికి రాగానే అప్పు కింద మొక్కజొన్నను తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోళ్లు చేస్తున్నారు. మద్దతు ధర రూ.1760 ఉండగా దళారులు రైతుల వద్ద రూ.1500లకు మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నారు. ఇదే మొక్కజొన్నను రైతు ప్రజాప్రతినిధి స్థానికంగా ఉండే ఐసీడీఎంలోని ఇద్దరు ఉద్యోగులు, మండ ల వ్యవసాయ సిబ్బంది సహాయ సహకారాల తో కొందరు రైతుల పత్రాలను సృష్టించి ప్రభుత్వం కొనుగోళ్లు కేంద్రంలో మద్దతు ధరకు విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడు తున్నారు. గాంధారిలోని పలు గ్రామాల పరిధిలో పండించిన రైతుల నుంచి తక్కు వ ధరకు మొక్కజొన్నను కొనుగోళ్లు చేస్తూ రైతులను నష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇలా గాంధారి మండలం నుంచే కాకుండా పొరు గు జిల్లా అయినా వర్ని మండల పరిధిలోని చం దూర్‌ సమీపంలో గల లక్ష్మాపూర్‌ గ్రామాల్లో కొందరు రైతుల నుంచి మొక్కజొన్నను కొనుగోళ్లు చేసి గాంధారిలో పలువురు రైతుల పేరిట దొంగ పత్రాలను సృష్టించి వంద లాది క్వింటాళ్ల చొప్పున మొక్కజొన్నను ప్రభుత్వ కొనుగోళ్లు కేంద్రాల్లో విక్రయించారనే ఆరోపణలు వస్తున్నాయి. గాంధారి లో జరుగుతున్న మక్కల కొనుగోళ్లపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపితే అక్రమాలు బయటపడే అవకాశం ఉందని, దీంతో స్థానికంగా ఉండే రైతులకు కాస్త అయినా మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.


పకడ్బందీగా కొనుగోళ్లు చేపడుతున్నాం: రంజిత్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ డీఎం

జిల్లాలో మక్కల కొనుగోళ్లు పకడ్బందీగా చేపడుతు న్నాం. 103 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇప్ప టి వరకు 500 మంది రైతుల నుంచి 30వేల టన్నుల మక్కలను కొనుగోలు చేశాం. కొనుగోళ్లలో దళారి వ్యవస్థ లేకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోళ్లు చేపడుతున్నాం. జిల్లాలోని పలు పీఏసీఎస్‌ల లో మక్కల కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయనే విషయం మా దృష్టికి రాలేదు. రైతులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

Updated Date - 2020-05-23T10:32:34+05:30 IST