ప్రతీ ఒక్కరికి పౌష్టికాహారం అందజేయడమే ప్రధాన లక్ష్యం

ABN , First Publish Date - 2021-02-24T06:15:09+05:30 IST

రాష్ట్రంలో ప్రతీ మారుమూల గ్రామంలోని బాలింతలు, గర్భిణులకు, కిషోరబాలికలకు ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందజేయడ మే ప్రధానలక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఫుడ్‌కమిషన్‌ చైర్మన్‌ తిరుమల్‌రెడ్డి అన్నారు.

ప్రతీ ఒక్కరికి పౌష్టికాహారం అందజేయడమే ప్రధాన లక్ష్యం
అంగన్‌వాడీ కేంద్రంలో రికార్డులను పరిశీలిస్తున్న తిరుమల్‌రెడ్డి

జిల్లాలోని పలు మండలాల పర్యటనలో రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తిరుమల్‌రెడ్డి

ఖానాపూర్‌, ఫిబ్రవరి 23 : రాష్ట్రంలో ప్రతీ మారుమూల గ్రామంలోని బాలింతలు, గర్భిణులకు, కిషోరబాలికలకు ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందజేయడ మే ప్రధానలక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఫుడ్‌కమిషన్‌ చైర్మన్‌ తిరుమల్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని పలు మారుమూల గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అడవిసారంగాపూర్‌, సిం గాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీరాంనాయక్‌ తండా గ్రామాల్లోని అంగ న్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పలు రికార్డులను పరిశీలించారు. ప్రతీ నెలా సరాఫరా అవుతున్న సరుకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో పప్పు, పాలు, నూనెతో పాటు మురుకులు, కోడిగుడ్లు సరిగ్గా రావడం లేదని శ్రీరాంనాయక్‌ తండా అంగన్‌వాడీ కేంద్రం టీచర్‌ సుమలత తెలుపడంతో సరుకులు ఎందుకు సరాఫరా అవ్వడం లేదని ఖానాపూర్‌ సీడీపీవో సరితను ప్రశ్నించారు. సరైన పర్యవేక్షణ లేదని ఆమెపై ఆగ్ర హం వ్యక్తం చేశారు.  కేసీఆర్‌ కిట్‌ అర్హులైన వారందరికి అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట నిర్మల్‌ డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, డీడబ్య్లూవో స్రవంతి, డీసీఎస్‌వో కిరణ్‌కుమార్‌, డీఎంఅండ్‌హెచ్‌వో ధన్‌రాజ్‌, ఆర్డీవో రమేష్‌రాథోడ్‌, స్థానిక సర్పంచ్‌ రామకృష్ణ, సీడీపీవో సరిత, సూపర్‌వైజర్‌ శ్రీలత ఉన్నారు. 

నాణ్యమైన భోజనం అందించాలి

మామడ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తిరుమల్‌రెడ్డి అన్నారు. మంగళవారంమామడతో పాటు మండలంలోని పరిమండల్‌ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన చిన్నారులకు పౌష్టికాహారం సక్రమ ంగా అందుతుందా!? లేదా!? అని చిన్నారుల తల్లిదండ్రులను, గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. వంటకు ఉపయోగించే పప్పు, నూనె, కారం వంటివి నాణ్యతగా లేవని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఈ విషయంలో రాజీ పడొద్దని సూచించారు. 


Updated Date - 2021-02-24T06:15:09+05:30 IST