పసుపు కొనుగోళ్లలో వ్యాపారుల మాయాజాలం

ABN , First Publish Date - 2021-01-25T05:21:16+05:30 IST

పసుపు రైతులు ఎంత కష్టపడి పంట పండించినా.. మా ర్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌గా మారుతుండడంతో వారు పెట్టిందే ధరగా ఉంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారు లు రాకపోవడం వల్ల పోటీ ఉండడం లేదు. రైతులు పండించిన పసుపునకు ధర పెరగడం లేదు.

పసుపు కొనుగోళ్లలో వ్యాపారుల మాయాజాలం

సిండికేట్‌గా మారి ధర నిర్ణయం

ఇతర రాష్ట్రాల నుంచి రాని వ్యాపారులు

ప్రభుత్వం బోనస్‌ ఇస్తేనే పసుపు రైతులకు ఊరట

నిజామాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పసుపు రైతులు ఎంత కష్టపడి పంట పండించినా.. మా ర్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌గా మారుతుండడంతో వారు పెట్టిందే ధరగా ఉంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారు లు రాకపోవడం వల్ల పోటీ ఉండడం లేదు. రైతులు పండించిన పసుపునకు ధర పెరగడం లేదు. ఇతర రాష్ట్రాల లాగా ప్రభుత్వం పసుపు రైతులకు బోనస్‌ ప్రకటించకపోవడం వ ల్ల లాభం జరగడం లేదు. రైతులు ప్రతియేడు మద్దతు ధర కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలితం మాత్రం ఉండడం లేదు. నిజామాబాద్‌ మార్కెట్‌కు ప్రతియేడు 20 లక్షల బ స్తాలకు పైగా పసుపు వస్తుంది. నిజామాబాద్‌ జిల్లాతో పా టు జగిత్యాల, నిర్మల్‌, వరంగల్‌ జిల్లాల నుంచి పసుపు ఈ మార్కెట్‌కు తీసుకువస్తారు. దీంతో పాటు మహారాష్ట్ర నుం చి కొంత మంది రైతులు తీసుకవచ్చి అమ్మకాలు చేస్తారు. నిజాం కాలం నుంచి ఈ మార్కెట్‌లో కొద్దిమంది వ్యాపారులదే పైచేయిగా ఉంది. సుమారు 50 మంది వరకు పసుపు వ్యాపారులు ఉన్నా మెజారిటీ మాత్రం 10 నుంచి 20 మంది వరకే ఎక్కువగా పసుపు కొనుగోలు చేస్తారు. వీరే మార్కెట్‌ లో ధర నిర్ణయిస్తారు. ప్రతియేడు జనవరి నుంచి జూన్‌ వ రకు ఎక్కువగా ఈ మార్కెట్‌కు పసుపు వస్తుంది. ఫిబ్రవరి నుంచి మే వరకు ప్రతినెల లక్షన్నర నుంచి రెండున్నర లక్ష ల క్వింటాళ్ల వరకు పసుపు అమ్మకాలు జరుగుతాయి. ఈ నాలుగు నెలల కాలంలో ఎక్కువ మంది రైతులు ఈ పసుపును తీసుకవచ్చి అమ్మకాలు చేస్తారు. ఈ మార్కెట్‌కు ఇత ర రాష్ట్రాల నుంచి  వ్యాపారులు కొనుగోలుకు రావడం లేదు. ఈ-నామ్‌ ఉన్నా ఇతర రాష్ట్రాలతో అనుసంధానం కాకపోవడం వల్ల వేరే రాష్ట్రం నుంచి కొనుగోలు జరగడం లేదు. ప్రతియేడు ఇక్కడి వ్యాపారులు నిర్ణయించిందే ధరగా మారుతోంది. వీరు ఇతర దేశాలకు చేసే ఎగుమతుల ఆధారంగా కొనుగోలు చేస్తున్నారు. దానిని బట్టి ధర నిర్ణయిస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో కొద్దిగా ధర ఎక్కువగా ఉన్నా ఇక్కడ మాత్రం వారు పెట్టిందే రేటుగా మారుతోంది. వ్యాపారులంతా సిండికేట్‌గా ఉండడం ఎక్కువ మంది పోటీపడకపోవడం వల్ల గ డిచిన నాలుగు సంవత్సరాలుగా పసుపు ధర పెరగలేదు. క్వింటాలు రూ.4 వేల నుంచి రూ.6,500 మధ్యనే ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించకపోవడం వల్ల వ్యాపారులు పెట్టిందే ధరగా ఉంటోం ది. వారు కొనుగోలును బట్టి ఈ ధర నిర్ణయిస్తున్నారు. నా ణ్యమైన పసుపు వచ్చినా ధర మాత్రం క్వింటాలుకు రూ.6 వేలకు మించి పలకడం లేదు. ప్రతీ సంవత్సరం రైతులు ఎంత ఆందోళనలు నిర్వహించినా ఫలితం ఉండడం లేదు. చివరకు విధిలేని పరిస్థితుల్లో అమ్మకాలను చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో రైతులను ఆదుకునేందుకు బోనస్‌ను ప్రకటిస్తున్నారు. మార్కెట్‌లో వచ్చిన రేటుకు అదనంగా ఈ బోనస్‌ను ఇస్తున్నారు. పక్కనే ఉన్న ఏపీలో క్వింటాలుకు 6,800 రూపాయలకు పసుపు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో ధర తగ్గినా బోనస్‌ ఉండడం వల్ల రైతులకు మేలు జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ బోనస్‌పై దృష్టి పెడితే కొంత మేరకు రైతులకు ఉపయోగపడను ంది. మార్కెట్‌లో జరిగే అమ్మకాలపైన ప్రభుత్వం దృష్టి సా రిస్తే  రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల వ్యాపారులను ఆహ్వానిస్తే పసుపుకు ధర పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు ఈ విషయంపై దృష్టి పెడితే పసుపు రైతులకు పెద్ద ఎత్తున ఊరట దొరికే అవకాశం ఉంది.

Updated Date - 2021-01-25T05:21:16+05:30 IST