Abn logo
Sep 28 2021 @ 16:45PM

ఆమెకు పెళ్లయ్యాక ప్రియుడి ఫోన్.. బతిమిలాడితే రాత్రి 11 గంటలకు స్నేహితురాలితో సహా వెళ్లిందా యువతి.. ఆ తర్వాత..

మధ్యప్రదేశ్: ఆమెకు వేరొకరితో పెళ్లయిపోయింది. కానీ ఓ రోజు రాత్రి అనూహ్యంగా మాజీ ప్రియుడి నుంచి ఫోన్ వచ్చింది. ఆమెను కలవమని కోరాడు. దానికి మొదట ఆమె నిరాకరించింది. కానీ అతడు బతిమిలాడితే చివరకు రాత్రి 11గంటలకు స్నేహితురాలిని వెంటబెట్టుకుని వెళ్లింది. ఆ తర్వాత ప్రియుడు చేసిన నిర్వాకం ఏంటంటే.. 


ఇండోర్‌లోని ఫిర్దోస్ నగర్‌కు చెందిన అల్లు షేక్ గతంలో రుక్సానా అనే యువతిని ప్రేమించాడు. ఇతర కారణాల వల్ల ఆమెకు వేరొకరితో పెళ్లయింది. కొద్ది రోజుల తర్వాత అతడు ఆమెకు ఫోన్ చేసి ఓసారి కలవాలని, బయటికి రమ్మని కోరాడు. దానికి మొదట ఆమె నిరాకరించినా.. అతడు బతిమిలాడితే చివరకు ఒప్పుకుంది. సోమవారం రాత్రి 11గం.లకు రుక్సానా ఆమె స్నేహితురాలు అఫ్సానాని వెంటబెట్టుకుని వెళ్లింది. 

రాజ్‌బారా చౌపట్టి దగ్గర వారిద్దరు అల్లుని కలిశారు. అక్కడ అల్లు, రుక్సానా మధ్య మాటామాటా పెరిగింది. దీంతో అతడు వెంట తెచ్చుకున్న కత్తితో రుక్సానాపై దాడిచేశాడు. అడ్డుకోబోయిన అఫ్సానాని కూడా కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో రుక్సానా కాలిపై రెండు గాయాలవగా, అఫ్సానాకు చేతికి గాయమైంది. తర్వాత నిందితుడే గాయపడ్డ వారిద్దరిని ఎంవై ఆసుపత్రిలో చేర్పించి, అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు దొంగతనం కేసులో జైలుపాలై ఇటీవలే విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అల్లుకోసం గాలిస్తున్నారు.

క్రైమ్ మరిన్ని...