Abn logo
Sep 30 2020 @ 01:19AM

ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలి

ఆమనగల్లు : ఎల్‌ఆర్‌ఎ్‌సను వెంటనే రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ మున్సిఫల్‌ కన్వీనర్‌ సుండూరు శేఖర్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు.  అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌, వైస్‌ చైర్మన్‌ భీమనపల్లి దుర్గయ్యలతో కలిసి శేఖర్‌, నాయకులు మున్సిపల్‌ కమిషనర్‌ శ్యామ్‌ సుందర్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను నింపుకోవడానికి ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో ప్రజలపై భారం మోపడం తగదని పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేసే వరకు పోరాడుతామని తెలిపారు. పేదలకు ప్రభుత్వం ప్రకటించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, మూడెకరాల భూమి ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి గోరటి నర్సింహ, కౌన్సిలర్లు, నాయకులు దుడ్డు కృష్ణ, శ్రీఽధర్‌, చెన్నకేశవులు, లక్ష్మణ్‌, పాష, శ్రీకాంత్‌సింగ్‌, ప్రశాంత్‌, శ్రీను పాల్గొన్నారు.   

Advertisement
Advertisement
Advertisement