ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-09-30T05:57:12+05:30 IST

బీజేపీ రాష్ట్రశాఖ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని బీజేపీ నాయకులు ధర్నా

ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలి

తహసీల్దార్‌ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేసిన బీజేపీ నాయకులు

ప్రభుత్వం జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్

ఎల్‌ఆర్‌ఎస్‌ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ డిమాండ్‌


బీజేపీ రాష్ట్రశాఖ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌లకు వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వం వెంటనే జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.


ఏసీసీ, సెప్టెంబరు 29: బీజేపీ రాష్ట్రశాఖ పిలుపు మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ను పూర్తిగా రద్దు చేయాలని స్థానిక మంచిర్యాల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపతి మల్లేష్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం  ఎల్‌ఆర్‌ఎస్‌ను విధించి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తోందని చెప్పారు. దీన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి బోయిని హరికృష్ణ, మహిళ నాయకురాలు రేకేందర్‌వాణి, మహిళ మోర్చా అధ్యక్షురాలు బోయిని లలిత, పట్టణ ఉపాధ్యక్షుడు రాజమల్లయ్య, ప్రధాన కార్యదర్శి రంగా శ్రీశైలం, కార్యాలయ కార్యదర్శి మల్యాల శ్రీను పాల్గొన్నారు. 


నస్పూర్‌: నస్పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట స్థానిక నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్‌ అగల్‌ డ్యూటీ రాజు, కౌన్సిలర్‌ సత్యనారాయణ, బీజేపీ నాయకులు రమేష్‌, శ్వేత, మహేష్‌, చక్రవర్తి, భీమయ్య, రాజు, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 


తాండూర్‌(బెల్లంపల్లి): ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని బీజేపీ తాండూర్‌ మండల నాయకులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పుల్గం తిరుపతి, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాగిడి చిరంజీవి మాట్లాడారు. కార్యక్రమంలో  నాయకులు శేషగిరి, విజయ్‌, శ్రీనివాస్‌, కుమార్‌, శ్రీకాంత్‌, భరత్‌కుమార్‌, సురేష్‌, ప్రదీప్‌, నాగయ్య, మల్లేష్‌, సాయి, వినోద్‌ పాల్గొన్నారు. 


బెల్లంపల్లి టౌన్‌: ఎల్‌ఆర్‌ఎస్‌ జీవోను వెంటనే రద్దు చేయాలని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేశ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ కుమార స్వామికి వినతి పత్రం సమర్పించారు.  కార్యక్రమంలో ఎస్సీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకల శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షులు కాసర్ల యాదగిరి, బద్దం వాసురాం, రేవెల్లి రాజలింగం, నాయకులు ముడిమడుగుల శ్రీనివాస్‌, మేకల శేఖర్‌, సదానందం, శనిగారపు శ్రావణ్‌, రమేష్‌, అడిచర్ల రాం చందర్‌, సునీల్‌, గుండా అభిలాష్‌, జూపాక సాయి, మంచెర్ల శేఖర్‌, రవీందర్‌ పాల్గొన్నారు. 


దండేపల్లి: మండల కేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీజేపీ మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య ఆఽఽధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌ హన్మంతరావుకు వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు చింటూ, శక్తి కేంద్రం మండల ఇన్‌చార్జి ముత్తె భూమేష్‌, నాయకులు సుగుణ, నరేష్‌, శంకర్‌గౌడ్‌, సతీష్‌, సత్యం, మల్లేస్‌, వేణుగోపాల్‌, దీలీప్‌, భీమయ్య, సతీష్‌, సురేష్‌గౌడ్‌, హరీష్‌, సురేందర్‌, రాకేష్‌, తదితరులు పాల్గొన్నారు. 


కోటపల్లి: ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని బీజేపీ మండల నాయకులు తహసీల్దార్‌ రామచంద్రయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి జూల లక్ష్మణ్‌, పార్టీ మండల అధ్యక్షుడు పెద్దల  సత్యం, నాయకులు నర్సింహులు, మోహన్‌, శంకర్‌, కిష్టయ్య, బాపు తదితరులు పాల్గొన్నారు. 


జన్నారం: మండంలోని బీజేపీ నాయకులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గోలి చందు, నాయకులు ప్రేంసాగర్‌, దేవేందర్‌, కోమురయ్య, బోడ తిరిపతి, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.


లక్షెట్టిపేట: ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేకంగా ఉందని, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలంటూ మండల, మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ నాయకులు తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు బొప్పు కిషన్‌, చాతరాజు శివశంకర్‌, వేముల మధు, నయీమ్‌, హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు. 


భీమారం: ఎల్‌ఆర్‌ఎస్‌ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ మండలాధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం భీమారంలోని స్ధానిక బస్టాండ్‌ వద్ద రాస్తారోకో నిర్వహించి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.  కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వేముల మధుకర్‌, జాడి ప్రభాకర్‌, ఉ పాధ్యక్షులు రాజు, నాయకులు శ్యాం, నాయకురాల్లు పెద్దపల్లి వనిత, దాసరి రమాదేవి, జాడి రమ, నైతం సుగుణ తదితరులు పాల్గొన్నారు. 


మందమర్రిరూరల్‌:  ఎల్‌ఆర్‌ఎస్‌ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ మండలాధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్‌, పట్టణాధ్యక్షుడు  మద్ది శంకర్‌  డిమాండ్‌ చేశారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు నల్లబ్యాడ్జిలు ధరించి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ మోహన్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు చప్పిడి నరేష్‌, డీవీ దీక్షితులు, బియ్యాల సమ్మయ్య, లక్ష్మణ్‌, నగేష్‌, శ్రీనివాస్‌, ఓదెలు, మహిళ మోర్చా అధ్యక్షురాలు దాసరి నిర్మల, రవిసాగర్‌, రజిత, దుర్గరాజ్‌, రాజు, కుమార్‌, లింగయ్య పాల్గొన్నారు. 


కాసిపేట: ఎల్‌ఆర్‌ఎస్‌ జీవోను రద్దు చేయాలని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.  అనంతరం తహసీల్దార్‌ భూమేశ్వర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సతీష్‌రెడ్డి, అట్కపురం రమేష్‌, రాజశేఖర్‌, దాస్‌, రాజం, పోచం, రవి,  శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


వేమనపల్లి: ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందికి బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు బైస మల్లేష్‌, ప్రధాన కార్యదర్వి గణపురం సంతోష్‌, నాయకులు పాల్గొన్నారు. 


నెన్నెల: ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని బీజేపీ నాయకులు తహసీల్దార్‌ సంపతి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు టి. శైలెందర్‌సింగ్‌, ఉపాధ్యక్షులు గట్టు రాజయ్య, ప్రధానకార్యదర్శి గోగు సురేందర్‌, నాయకులు శివలింగు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-30T05:57:12+05:30 IST