Abn logo
Sep 27 2021 @ 00:08AM

ప్రేమ సమాజం నూతన కార్యవర్గం

ప్రేమసమాజం నూతన కార్యవర్గం సభ్యులు

డాబాగార్డెన్స్‌, సెప్టెంబరు 26: ప్రేమ సమాజం ఉన్న తికి కృషి చేద్దామని అధ్యక్షులు కంచర్ల రామబ్రహ్మం అన్నారు. విశాఖనగరం డాబాగార్డెన్స్‌ ప్రేమ సమాజం మినీ హాల్‌లో ఆది వారం నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా 2021-23 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  అధ్యక్షులుగా పైడా కృష్ణప్రసాద్‌, ఉపాధ్యక్షులుగా బుద్ధ శివాజీ, నర్సింహమూర్తి, కార్యదర్శిగా కోన జగదీశ్వరరావు, కోశాధికారిగా మట్టపల్లి హనుమంతరావు, సంయుక్త కార్య దర్శులుగా అప్పలరాజు, నాగేశ్వరరావు, మోహనరావులతో పాటు మొత్తం 20 మంది సభ్యులను ఎన్నుకున్నారు. 90 ఏళ్ల చరిత్రగల ప్రేమ సమాజంలోని వారికి సేవలందించే అవకాశం కలగడం ఆనందంగా ఉందని అధ్యక్షుడు  పైడా కృష్ణప్రసాద్‌, ఇతర సభ్యులు అన్నారు.