Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒకరికి తెలీకుండా మరొకరితో మహిళ ప్రేమాయణం.. సడన్‌గా మలుపు తిరిగిన కథ.. చివరకు ఎంతవరకు వెళ్లిందంటే..

అక్రమ సంబంధం పెట్టుకోవడమే తప్పు.. అలాంటిది కొందరైతే ఒకే సమయంలో పలువురితో వివాహేతర సబంధం పెట్టుకుంటూ, ఒకరికి తెలీకుండా మరొకరితో ప్రేమాయణం సాగిస్తుంటారు. అసలు రంగు బయటపడగానే.. ఎదుటి వారిపై తప్పులు మోపుతూ ఏమీ ఎరుగనట్లు వ్యవహరిస్తుంటారు. చివరకు అసలుకే ఎసరు వస్తుందని ఊహించరు. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ మహిళ ఇలాగే ఏక కాలంలో ఇద్దరితో ప్రేమాయణం నడిపింది. అయితే సడన్‌గా ఓరోజు కథ అడ్డం తిరిగింది. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం నాగులపల్లిలో గూడవల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. ఇతడికి సమీప పంగిడిగూడెంకు ప్రాంతానికి చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ మహిళకు అప్పటికే అప్పారావు అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఆ విషయం దాచిపెట్టి.. శ్రీనివాస్‌తో ప్రేమాయణం సాగించేది. ఇలా కొన్నాళ్ల పాటు ఒకరికి తెలీకుండా మరొకరితో ప్రేమాయణం సాగించింది. ఓ రోజు శ్రీనివాస్‌తో ఆమె నడుపుతున్న వ్యవహారం మొత్తం అప్పారావ్‌కు తెలిసిపోయింది.

భర్తతో సుఖం దొరకలేదని.. పరాయి మగవారిపై మనసు పడింది.. ఓ రోజు చెత్త ఏరుకునే వ్యక్తి ఇంట్లోకి రాగానే..

ఈ ఏడాది అక్టోబర్ 19న శ్రీనివాస్ మహిళను కలిసేందుకు పంగిడిగూడెం వెళ్లాడు. విషయం తెలుసుకున్న అప్పారావ్.. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్నాడు. శ్రీనివాస్ రాగానే దాడికి తెగబడ్డాడు. విషయం పెద్దదవడంతో గ్రామపెద్దలు పంచాయితీ పెట్టారు. శ్రీనివాస్‌కు రూ.70వేలు, అప్పారావుకు రూ.50వేల జరిమానా విధించి వదిలేశారు. తర్వాత జరిమానా కట్టాలని శ్రీనివాస్‌ను ఒత్తిడి చేశారు. రోజురోజుకూ ఒత్తిడి ఎక్కువవడంతో మనస్థానం చెందిన శ్రీనివాస్.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ పెద్దలపై కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

వారికి ఇద్దరు పిల్లలు.. సడన్‌గా భర్త లింగమార్పిడి.. తర్వాత యువకుడితో ఆమె చేసిన సహజీవనం.. అంతవరకు వెళ్తుందని ఊహించలేదు..

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement