వామనాలంకారంలో సింహాచలేశుడు

ABN , First Publish Date - 2022-01-18T05:16:23+05:30 IST

సింహాద్రి అప్పన్న స్వామి సోమవారం భక్తులకు వామనాలంకారంలో దర్శనమిచ్చారు.

వామనాలంకారంలో సింహాచలేశుడు
వామనాలంకారంలో దర్శనమిచ్చిన సింహాద్రి అప్పన్న స్వామి

సింహాచలం, జనవరి 17: సింహాద్రి అప్పన్న స్వామి సోమవారం భక్తులకు వామనాలంకారంలో దర్శనమిచ్చారు. ఈ నెల 13న ప్రారంభమైన వార్షిక రాపత్తు ఉత్సవాల్లో భాగంగా సింహాచలేశుడు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఆలయ అలంకారి, పురోహితుడు కరి సీతారామాచార్యులు చేతితో గొడుగు, మరొక చేతితో కమండలం (ఉదక పాత్ర)ను ధరించినట్టుగా అలంకరించారు. ప్రత్యేక పల్లకిలో వామనాలంకరణలో వున్న స్వామిని, మరో పల్లకిలో నలుగురు ఆళ్వార్లను వుంచి తొలుత బేడా మండపంలో, ఆ తర్వాత సింహగిరి మాడవీధుల్లో మంగళవాయిద్యాలు, వేదపండితుల పారాయణలు నడుమ తిరువీధిని వైభవంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుడు డాక్టర్‌ టీపీ రాజగోపాల్‌, హవల్దార్‌ రవి ఆధ్వర్యంలో నాలాయిర దివ్యప్రబంధంలోని వంద పాశురాలను అధ్యాపకులు ఆలపించగా, అర్చకుడు పవన్‌కుమార్‌ ప్రత్యేక పూజలు చేశారు. దారి పొడవునా పలువురు భక్తులు స్వామివారికి కర్పూర నీరజనాలు సమర్పించారు. 


Updated Date - 2022-01-18T05:16:23+05:30 IST