Advertisement
Advertisement
Abn logo
Advertisement

నదిలో నీరు తాగుతున్న గేదెపై సింహాల దాడి.. సడన్‌గా సీన్‌ రివర్స్.. వైరల్ అవుతున్న వీడియో..

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి.. చిన్న చిన్న విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఒక్కోసారి కొన్ని వీడియోలు, వార్తలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. సాధు జంతువులపై క్రూర జంతువులు దాడి చేయడం సహజమే. ఇక సింహం అంటే చెప్పాల్సిన పని లేదు. దాని ధాటికి మిగతా జంతువులన్నీ ఆమడ దూరం పెరుగెడతాయి. అందుకే దాన్ని అడవికి రారాజు అంటారు. విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో ఓ గేదెపై సింహం దాడి చేసింది. 


సింహం వేటకు అద్దూ.. అదుపూ ఉండదు. దాని పంజా దెబ్బకు ఎంత పెద్ద జంతువైనా కుప్పకూలాల్సిందే. అయితే ఇక్కడ మాత్రం దాని పప్పులు ఉడకలేదు. దాహం వేసి నీరుతాగడానికి వెళ్లిన ఓ గేదెను..  రెండు సింహాలు గమనిస్తూ ఉన్నాయి. అదును చూసి ఒక్కసారిగా దానిపై దూకాయి. ఊహించని ఘటనతో బెదిరిపోయిన గేదె.. కొద్ది సేపు తడబడ్డా, తర్వాత తిరగబడింది. ప్రాణాలు కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా పోరాడింది.  


ప్రమాదంలో ఉన్న గేదెను చూసిన మిగతా గేదెలు.. ఒక్కసారిగా సీన్‌లోకి ఎంటరయ్యాయి. గుంపులు గుంపులుగా వచ్చిన గేదెలను చూసిన సింహాలు దడుసుకున్నాయి. ఒక సింహం ఎలాగోలా బయటపడింది. ఇంకో సింహం మాత్రం.. గేదెలకు చిక్కింది. ఇంకేముంది అన్ని గేదెలూ కలిసి ఆ సింహాన్ని చెడుగుడు ఆడుకున్నాయి. గాల్లోకి ఎగరేస్తూ.. కొమ్ములతో ఆడుకుని, చివరికి కాళ్లతో తొక్కి చంపేశాయి. పార్కులోకి వచ్చిన సందర్శకులు ఈ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement