పిడుగుపాటుకు 22 మూగజీవాలు మృతి

ABN , First Publish Date - 2021-04-22T07:21:55+05:30 IST

ఉమ్మడి జిల్లాలో పిడిగుపాటుకు గురై 22 జీవాలు మృత్యువాతపడ్డాయి. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో అంతంపేట గ్రామానికి చెందిన జనగం సైదులుకు చెందిన గేదె, కొండూరు గ్రామానికి చెందిన గడ్డం జంగయ్యకు చెందిన ఆవు పిడుగుపాటుతో మృతిచెందాయి.

పిడుగుపాటుకు 22 మూగజీవాలు మృతి

మర్రిగూడ/నడిగూడెం ఏప్రిల్‌ 21 : ఉమ్మడి జిల్లాలో పిడిగుపాటుకు గురై 22 జీవాలు మృత్యువాతపడ్డాయి. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో మంగళవారం రాత్రి  ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో అంతంపేట గ్రామానికి చెందిన జనగం సైదులుకు చెందిన గేదె, కొండూరు గ్రామానికి చెందిన గడ్డం జంగయ్యకు చెందిన ఆవు పిడుగుపాటుతో మృతిచెందాయి. అదేవిధంగా అకాల వర్షంతో మండలంలో 195ఎకరాల వరిధాన్యం దెబ్బతింది. చర్లగూడెం, ఎరుగండ్లపల్లి గ్రామంలో ఏడు ఇళ్లు పూర్తిగా నేలమట్టంకాగా, మరో నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని మర్రిగూడ తహసీల్దార్‌ దేశ్యానాయక్‌ బుధవారం తెలిపారు. ఇట్టి నివేదికను జిల్లా అధికారులకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఆర్‌ఐ బషీర్‌, సిబ్బంది ఉన్నారు. అదే విధంగా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని రత్నవరంలో గ్రామంలో పిడుగుపాటుకు 20 మేకలు మృత్యువాత పడాయి. వీటి విలువ రూ.4లక్షల వరకు ఉంటుందని బాధితులు తెలిపారు. 

Updated Date - 2021-04-22T07:21:55+05:30 IST