Abn logo
Sep 24 2021 @ 23:44PM

కట్టెమిషన్ల లైసెన్స్‌ విధానాన్ని రద్దు చేయాలి

మంత్రి హరీశ్‌రావును కలిసిన విశ్వబ్రాహ్మణులు

బాలానగర్‌, సెప్టెంబరు 24 : విశ్వబ్రాహ్మణ వృత్తిలో భాగమైన వడ్రంగి పని చేసుకుంటూ కట్టెకోత మిషన్‌లపై ఆధార పడి బతుకుతున్న వడ్రంగులపై అటవీశాఖ ద్వారా విధించిన ఆంక్షలను రద్దు చేయించాలని శుక్రవారం హైదరా బాద్‌లో రాష్ట్ర ఆర్థిశాఖ మంత్రి హరీశ్‌రావును విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం నాయకులు కలిసి వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా సలహాదారులు చక్రంచారి మాటా ్లడుతూ రక్షిత అడవుల నుంచి చెట్లను నరికి రంపపు మిల్లు లకు తరలిస్తున్నారన్న అపోహలతో వడ్రంగి పని చేసే విశ్వ బ్రాహ్మణులపై రకరకాల ఇబ్బందులు పెట్టడం తగదన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్పందించి అటవీ శాఖ మంత్రి తో ఫోన్‌లో మాట్లాడినట్లు సభ్యులు తెలిపారు. అలాగే అసెంబ్లీ లో తమ సమస్యలను చర్చించి పరిష్కరించేందుకు హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఫారెస్ట్‌  చీఫ్‌ సెక్రటరీ శాంతకు మార్‌ను కలిసి వారి డిమాండ్లను వివరించారు. సంఘం మండల అధ్యక్షుడు మనోహరచారి, చక్రంచారి, కుమారచారి, వెంకట్‌రా ములుచారి పాల్గొన్నారు.