Gorantla madhvaపై మండిపడ్డ కురుబ సంఘం నేతలు

ABN , First Publish Date - 2022-08-09T19:42:30+05:30 IST

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై కురుబ సంఘం నేతలు మండిపడ్డారు.

Gorantla madhvaపై మండిపడ్డ కురుబ సంఘం నేతలు

అనంతపురం: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ (Gorantla madhav)పై కురుబ సంఘం నేతలు  మండిపడ్డారు. గోరంట్ల మాధవ్ ఇటీవల పాల్పడ్డ అసాంఘిక కార్యక్రమం యావత్ కురుబ జాతికే కళంకమన్నారు. చట్టం ప్రకారం ప్రభుత్వం శిక్షిస్తే కురుబ సంఘం ఎలాంటి అభ్యంతరమూ తెలపదని...కానీ గోరంట్ల మాధవ్ కురుబ కులాన్ని అడ్డంపెట్టుకుని తన రాజకీయ మనుగడను సాగించాలనుకోవడం బాధాకరమని అన్నారు. గోరంట్ల మాధవ్ అసాంఘిక కార్యకలాపాలకు , కురుబ కులానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా కురుబ సంఘం స్వాగతిస్తుందని అన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు కులాలను అడ్డుపెట్టుకోవడం కురుబ సంఘం అంగీకరించదన్నారు. కురుబ కులానికి దేశంలో ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నాయని వెల్లడించారు. కురుబ కులస్తులు కూడా అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారన్నారు.  కానీ అదే కురుబ కులానికి చెందిన వారు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి , వాటి నుండి తప్పించుకునేందుకు కురుబ జాతిని అడ్డంపెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నారని కురుబ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-08-09T19:42:30+05:30 IST