బీడీ కార్మికుల పొట్టలు కొట్టే చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2021-02-26T05:21:19+05:30 IST

లక్షలాది మంది బీడీ కార్మికుల పొట్టలు కొట్టే సిగరెట్స్‌ అండ్‌ అదర్‌ టొబాకో ప్రొడక్షన్‌ చట్టాన్ని వెంటనే ఉప సంహ రించుకోవాలని భారత కార్మికసంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి. శ్రీని వాస్‌ డిమాండ్‌ చేశారు.

బీడీ కార్మికుల పొట్టలు కొట్టే చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి
సదస్సులో మాట్లాడుతున్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌

ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ర్యాలీ 

కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా 

రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి. శ్రీనివాస్‌

నిర్మల్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : లక్షలాది మంది బీడీ కార్మికుల పొట్టలు కొట్టే సిగరెట్స్‌ అండ్‌ అదర్‌ టొబాకో ప్రొడక్షన్‌ చట్టాన్ని వెంటనే ఉప సంహ రించుకోవాలని భారత కార్మికసంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి. శ్రీని వాస్‌ డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించి సిగరెట్స్‌ అండ్‌ అదర్‌ టొబాకో ప్రొడ క్షన్‌ చట్టాన్ని రద్దు చేయాలని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వ హించారు. అనంతరం టీఎన్‌జీవో భవనంలో ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం బీడీ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న బీడీ పరి శ్రమ మూసి వేయడానికి లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎందరో మంది మహిళ లు బీడీ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారని, కుట్ర పూరితమైన నిర్ణయాలతో కొత్త చట్టాన్ని తీసురావడం జరుగుతుందన్నారు. కొత్త చట్టం అమలు చేస్తే అన్ని రకాలుగా మోసపోతారన్నారు. ప్రతిరోజు బీడీ కార్మికులు అనేక రకాలుగా మోసపోతున్నారని, కొత్త చట్టంతో బీడీకార్మికుల కుటుంబాలు రోడ్డున పడవలసి వస్తుందన్నారు. ఇప్పటికైనా ఈ చట్టం నుండి బీడీ పరిశ్రమను ఉపసంహరించాలని, లేని యెడల ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బక్కన్న, కార్యదర్శి కే. రాజన్న, సీపీఐ ఎంఎల్‌న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నందిరామయ్య, పీవోడబ్ల్యూ అధ్యక్ష, కార్యదర్శులు కే. లక్ష్మి, హరిత, నాయకులు రాజు, గంగన్న, తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-02-26T05:21:19+05:30 IST