ముగిసిన పది స్పాట్‌

ABN , First Publish Date - 2022-05-23T06:00:15+05:30 IST

ఈ ఏడాది పదో తరగతి పరీక్షల మూల్యాంకన శిబిరం ఆదివారంతో ముగిసింది. ఈ నెల 13 నుంచి స్పాట్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ముగిసిన పది స్పాట్‌

కర్నూలు(ఎడ్యుకేషన్‌), మే 22: ఈ ఏడాది పదో తరగతి పరీక్షల మూల్యాంకన శిబిరం ఆదివారంతో ముగిసింది. ఈ నెల 13 నుంచి స్పాట్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జిల్లా విద్యాశాఖ స్థానిక మాంటిస్సోరి పాఠశాలలో స్పాట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇతర జిల్లాల నుంచి 3,66,638 జవాబు పత్రాలు వచ్చాయి. 14 సబ్జెక్టుల జవాబు పత్రాలను దిద్దారు. డీఈవో రంగారెడ్డి పర్యవేక్షణలో ఇద్దరు డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లు, 157 మంది ఎగ్జామినర్లు, 1208 అసిస్టెంటు ఎగ్జామినర్లు, 380 మంది స్పెషల్‌ అసిస్టెంట్లను నియమించారు. మొదట స్పాట్‌ డ్యూటీలకు ఉపాధ్యాయులు విముఖత చూపించినప్పటికీ డీఈవో రంగారెడ్డి వారికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో విధులకు హాజరు కావడంతో సకాలంలో స్పాట్‌ వాల్యూయేషన్‌ పూర్తి చేసినట్లు డీఈవో రంగారెడ్డి తెలిపారు. అధికారులకు, టీచర్లకు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.

Updated Date - 2022-05-23T06:00:15+05:30 IST