ఉండ్రుగొండలో పురాతన దేవాలయాల భూములను పరిరక్షించాలి

ABN , First Publish Date - 2022-05-25T06:07:27+05:30 IST

ఉర్లుగొండ గ్రామంలో పురాతన దేవాలయాలు, దేవుడి విగ్రహాలను కూల్చివేస్తూ భూములను కొంత రియల్టర్లు ఆక్రమిస్తున్నారని వానరసేన సభ్యులు, హనుమాన్‌ భ

ఉండ్రుగొండలో పురాతన దేవాలయాల భూములను పరిరక్షించాలి
వానరసేన, హనుమాన్‌ భక్తులతో మాట్లాడుతున్న పోలీసులు

చివ్వెంల, మే 24: ఉర్లుగొండ గ్రామంలో పురాతన దేవాలయాలు, దేవుడి విగ్రహాలను కూల్చివేస్తూ భూములను కొంత రియల్టర్లు ఆక్రమిస్తున్నారని వానరసేన సభ్యులు, హనుమాన్‌ భక్తులు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం సూర్యాపేట నుంచి ఉండ్రుగొండ గ్రామం వరకు బైకు ర్యాలీ చేపట్టారు. క్రైస్తవ మతానికి చెందిన కొం దరు దేవాలయ ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేసి హిందూ దేవాలయాల చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. వారికి అధికారులు, పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఉండ్రుగొండ గ్రామ సమీపంలోని రామస్వామి దేవత పురాతన దేవాలయాల శిథిలాలు సర్వే నెంబరు 210లో ఉన్నాయన్నారు. ఉండ్రుగొండ గ్రామసమీపంలో 30 ఎకరాల్లో దేవాలయ భూములు ఉన్నాయని, గతంలో పురావస్తు శాఖ అధికారులు గుర్తించి భోర్డులు కూడా ఏర్పాటు చేశారన్నారు. గతంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని పడవేశారని, కొందరు భక్తులు విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించారన్నారు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా భూమి ప్రైవేట్‌ వ్యక్తుల ఆధీనంలో ఉందని, మతఘర్షణలు జరిగే అవకాశం ఉందని పోలీసులు ముందస్తు సమాచారం మేరకు ర్యాలీని జాతీయరహదారి వద్దనే నిలిపివేశారు. 

ఉండ్రుగొండ గుట్టలో రామమందిరం నిర్మిస్తాం

సూర్యాపేట సిటీ, మే 24 : చివ్వెంల మండలం ఉండ్రుగొండ గిరిదుర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో భవ్య రామమందిరం నిర్మాణం చేపడతామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. సూర్యాపేటలో ఆయన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉండ్రుగొండ గిరిదుర్గంలో రామమందిరం ఉన్నట్లు చరిత్ర ఆనవాళ్లు ఉన్నాయన్నారు. 207, 210, 211, 213 సర్వే నెంబర్లలో రామమందిరానికి సంబంధించిన భూములు ఉన్నాయన్నారు. దేవాలయభూములను పరిరక్షించాలని 2015 లో ప్రస్తుత మంత్రి జగదీ్‌షరెడ్డి హైదరాబాద్‌ పురావస్తు డైరెక్టర్‌కు లేఖ రాశారని, నేటికీ ఆ లేఖపై ఎలాంటి స్పందన రాలేదన్నారు. తప్పుడు పత్రాలను సృష్టించి సూర్యాపేట పట్టణానికి చెందిన మంత్రి జగదీ్‌షరెడ్డి అనుచరుడు దేవాలయ భూములను కబ్జా చేసి, భూపట్టాలను పొందాడని అన్నారు. భవ్య రామమందిరానికి సంబంధించిన భూములను పరిశీలించడానికి వెళ్లిన రాష్ట్రీయ వానరసేన బృందాన్ని ఉండ్రుగొండ వద్ద పోలీసులు అడ్డుకోవడం బాధాకరమన్నారు. దేవాలయ భూముల పరిరక్షణకు వానరసేన బృందం కట్టుబడి ఉందన్నారు. అక్కడ ఆలయ నిర్మాణం కోసం బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి నిధిని సమకూర్చుతామని, బీజేపీ ఆధ్వర్యంలోనే భవ్య రామమందిరం నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరందేర్‌, పట్టణ అధ్యక్షుడు అబీద్‌, పల్సా మల్సూర్‌ గౌడ్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీయే

ఆత్మకూర్‌(ఎస్‌): రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర ఉపాద్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. మండలంలోని రామన్నగూడెం గ్రామంలో విఽవిధ పార్టీల నుంచి నాయకులు బీజేపీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి, మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు పందిరి రాంరెడ్డి,కాప రవి,అభీద్‌, సైదులు,కర్ణాకర్‌రెడ్డి, వీరేంద్ర, నరేందర్‌,పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T06:07:27+05:30 IST