Sep 5 2021 @ 23:20PM

నా పదేళ్ల కష్టమిది! కార్తీక్‌ సాయి

‘‘తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో సుమారు 150 థియేటర్లలో సినిమా విడుదల చేశాం. మేమంతా కొత్తవాళ్లైనా... అన్ని సెంటర్స్‌లో మంచి టాక్‌ వచ్చింది. ప్రస్తుతం థియేటర్లు పెంచుతున్నారు. ఈ విజయం ఎంతో సంతోషాన్నిచ్చింది. నా పదేళ్ల కష్టమిది’’ అన్నారు కార్తీక్‌ సాయి. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ది కిల్లర్‌’. ఆవుల రాజుయాదవ్‌, సంకినేని వాసుదేవరావు నిర్మించారు. ఈ నెల 3న సినిమా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోందని ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సె్‌సమీట్‌లో నిర్మాత సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ డాలీషా, నటుడు మధు, ఎడిటర్‌ నాని, కెమెరామేన్‌ ఆర్యన్‌ తదితరులు పాల్గొన్నారు.