న్యాయ విజ్ఞాన సదస్సును వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-07T05:12:52+05:30 IST

గ్రామాల్లోని ప్రజలు ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సును వినియోగించు కోవాలని కొల్లాపూర్‌ సివిల్‌ కోర్టు జూనియర్‌ సివి ల్‌ ప్రధాన జడ్జి జ్యోత్స్న, జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌వీఎస్‌ఎస్‌.మిథున్‌తేజలు పిలుపునిచ్చారు.

న్యాయ విజ్ఞాన సదస్సును వినియోగించుకోవాలి
మారేడుమానుదిన్నె గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడుతున్న జడ్జి గుంటి జ్యోత్స్న


పెద్దకొత్తపల్లి, ఆగస్టు 6: గ్రామాల్లోని ప్రజలు ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సును వినియోగించు కోవాలని కొల్లాపూర్‌ సివిల్‌ కోర్టు జూనియర్‌ సివి ల్‌ ప్రధాన జడ్జి జ్యోత్స్న, జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌వీఎస్‌ఎస్‌.మిథున్‌తేజలు పిలుపునిచ్చారు. శని వారం మండల పరిధిలోని మారేడుమానుదిన్నె గ్రామంలో ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో వారు మాట్లాడారు. అనంతరం బాల్య వివాహాలు, వరకట్న నిషేధం, వరకట్న వేధింపులు, భూతగాదాలు, బాలకార్మిక నిర్మూలన వ్యవస్థ, ఫోక్సో తదితర చట్టాలపై అవ గాహన కల్పించారు. కొల్లాపూర్‌ బార్‌ అసోసి యేషన్‌ సంఘం అధ్యక్షుడు బాలస్వామి అధ్య క్షతన జరిగిన సదస్సులో సర్పంచ్‌ గన్నోజు సునీ త, జడ్పీటీసీ సభ్యురాలు మేకల గౌరమ్మ, న్యాయ వాదులు మనోహర్‌, నిరంజన్‌, రామలక్ష్మమ్మ, రాజు, లోక్‌అదాలత్‌ నిర్వాహకులు బోగ హరికృష్ణ, ఎస్సై రాముయాదవ్‌, ఎంపీడీవో కృష్ణయ్య, డిప్యూ టీ ఎమ్మార్వో పట్టాభి, గ్రామ కార్యదర్శి సలేశ్వరం, పారా లీగల్‌ వలంటీర్‌ శ్రీనివాసులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

 చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

వంగూరు : ప్రతీ ఒక్కరూ చట్టాలపై అవగా హన కలిగి ఉండాలని కల్వకుర్తి సివిల్‌ కోర్టు జూ నియర్‌ జడ్జి ప్రదీప్‌ అన్నారు. శనివారం  స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో న్యాయ వి జ్ఞాన సదస్సు నిర్వహించారు. ఎస్సై కురుమూర్తి, హెచ్‌ఎం బాల్‌నారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. 

 న్యాయ సహాయ కేంద్రం ప్రారంభం

పెంట్లవెల్లి :  మండలంలోని మల్లేశ్వరం గ్రా మంలో శనివారం ఉచిత న్యాయ సహాయ కేంద్రా న్ని కొల్లాపూర్‌ ఫస్ట్‌ అడిషనల్‌ జడ్జి జ్యోత్స్న ప్రా రంభించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాదులు ఉపేందర్‌ మాట్లాడు తూ ప్రతీ శనివారం గ్రామానికి ఒక న్యాయవాది వచ్చి న్యాయ సలహాలు అందజేస్తారని, గ్రా మంలో ఏమైనా సమస్యలుంటే న్యాయవాది వద్ద సలహాలు తీసుకోవాలని పేర్కొన్నారు. మల్లేశ్వరం సర్పంచ్‌ తిరుపాటి నాగరాజు, న్యాయవాదులు రాజు, బాలస్వామి తదితరులున్నారు.

Updated Date - 2022-08-07T05:12:52+05:30 IST