భవనానికి సంబంధించిన ప్లానింగ్ పేపర్‌ను పరిశీలిస్తున్న జడ్జి సంతోష్ కుమార్
దేవరకద్ర, మే 22 : నియోజకవర్గ కేంద్రమైన దేవరకద్రకు జూనియర్ సివిల్ జడ్జి, కం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు మంజూరు కావడంతో ఆదివారం కోర్టు నిర్వహణకు భవనాన్ని అదనపు జడ్జి సంతోష్‌కుమార్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఆత్మకూర్ లో ఉన్న కోర్టును దేవరకద్రకు మారుస్తున్నామని, ఇక్కడి పాత ఎంపీడీవో కార్యాలయంలో అనువుగా ఉంటుందన్నారు. ఇక్కడికి వచ్చిన తరువాత దేవరకద్రకు సంబంధించిన కేసు లను ఇక్కడే పరిష్కరిస్తామన్నారు. జూన్ 2న కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ భగవంతరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు, ఉప తహసీల్దార్ శివరాజు, గ్రామ పంచాయతీ ఈవో సీత్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
జడ్జికి సన్మానం
దేవరకద్రకు కోర్టు మంజూరు కావడంతో ఆదివారం కోర్టు భవనాన్ని పరిశీలించడానికి వచ్చిన అదనపు జడ్జి సంతోష్‌కుమార్‌ను టీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, కొండ శ్రీనివాసులును శాలువాతో ఘనంగా సన్మానించారు.