న్యూఢిల్లీ: కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మూసివేసినట్లు బుధవారం రోజు విశ్వసనీయ వర్గాలు పీటీఐకి తెలిపాయి. రాంబన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడడంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తుల్‌బాగ్ సమీపంలోని లోయలో ట్రక్కు బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. బుధవారం రాత్రి రాంబన్‌లోని బనిహాల్ అధికారులు తెలిపారు. 270 కిలోమీటర్ల పొడవు ఉన్న ఆల్-వెదర్ రహదారి కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతోంది. దుగ్గి పుల్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో రహదారిని మూసి వేయబడిందని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి