రక్షణ మంత్రిని హిమాచలీ టోపీ అడిగిన యువతి... తరువాత...

ABN , First Publish Date - 2021-01-07T16:25:27+05:30 IST

హిమాచల్‌కి చెందిన టోపీలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. జైపూర్‌కు చెందిన...

రక్షణ మంత్రిని హిమాచలీ టోపీ అడిగిన యువతి... తరువాత...

జైపూర్: హిమాచల్‌కి చెందిన టోపీలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. జైపూర్‌కు చెందిన అన్షూ అనే యువతి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను హిమాచలీ టోపీ కావాలని ట్విట్టర్‌లో కోరారు. ఇటీవల రాజ్‌నాథ్ సింగ్ హిమాచలీ టోపీ ధరించిన ఒక ఫొటోను ఆమె ట్విట్టర్‌లో చూశారు. దీంతో తనకు అంటువంటి టోపీ కావాలని ఆమె రక్షణమంత్రిని కోరారు. దీనిని చూసిన హిమాచల్ సీఎం కార్యాలయం ఆమెకు టోపీ అందించేందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించింది. 


డిసెంబరు 27న త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ ఓఎస్డీ సంజయ్ మిశ్రా... రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ హిమాచలీ టోపీ ధరించిన ఒక ఫోటోను ట్వీట్‌తో పాటు జత చేశారు. దీనికి చూసిన అంశు ఒక ట్వీట్‌లో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను హిమాచలీ టోపీ కావాలని అడిగారు. ఈ నేపధ్యంలో హిమాచల్ ముఖ్యమంత్రి జయరామ్ ఠాకుర్ కార్యాలయం అంశూ గురించి వాకబు చేసింది. తరువాత ఐటీ విభాగానికి చెందిన అధికారి కిశోర్ శర్మ జైపూర్‌లోని అంశుకు ఫోన్ చేసి, హిమాచలీ టోపీని ఆమెకు పంపించారు. దీంతో అంశు ట్విటర్‌లో ఈ టోపీని అందించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. దీనితోపాటు ఆమె ఆ హిమాచలీ టోపీని ధరించి, ఆ ఫొటోను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేస్తూ.... ‘జయరామ్ ఠాకుర్ సార్... నిజంగా మీరు మహనీయుడు. మా నాన్న చనిపోయిన తరువాత తొలిసారి నాకు కావల్సిన వస్తువు నాకు లభించింది. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది’ అని రాశారు.

Updated Date - 2021-01-07T16:25:27+05:30 IST