అత్యధిక వడ్డీకి అప్పులు తెచ్చిన JAGAN ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-05-11T00:50:28+05:30 IST

అత్యధిక వడ్డీకి అప్పులు తెచ్చిన JAGAN ప్రభుత్వం

అత్యధిక వడ్డీకి అప్పులు తెచ్చిన JAGAN ప్రభుత్వం

అమరావతి: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు అత్యధిక వడ్డీకి అప్పులు తెచ్చింది. రూ.3 వేలకోట్ల రుణం కోసం ఆర్‌బీఐ దగ్గర జగన్ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలం వేసింది. బిడ్డింగ్‌లో ఐదు రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఏపీ బాండ్లకు అత్యధిక వడ్డీ చెల్లిస్తేనే వేలం వేస్తామని ఆర్‌బీఐ (RBI) స్పష్టం చేసింది. రూ.2 వేల కోట్లకు 7.78 శాతం వడ్డీ (Interest) చెల్లింపు, మరో వేయి కోట్లకు 7.76 శాతం వడ్డీకి వేలం వేశారు. రుణ పరిమితికి అవకాశం ఇచ్చిన తర్వాత మొదటి విడతలోనే రూ.3 వేల కోట్ల బాండ్లను వేలం వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.28 వేల కోట్లకే కేంద్రం రుణ పరిమితి ఇచ్చింది. రూ.66 వేల కోట్ల రుణపరిమితి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది.

Read more