రాష్ట్రంలో శాంతి, భద్రతల సమస్య

ABN , First Publish Date - 2022-01-26T06:58:11+05:30 IST

మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలంగాణలో శాంతి భద్రతల సమస్య నెలకొందని, సీఎం కేసీఆర్‌ ఇందు కు కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన జిల్లా కేంద్రంలోని పలువురు సీనియర్‌ నాయకుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు.

రాష్ట్రంలో శాంతి, భద్రతల సమస్య
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

కేసీఆరే ఇందుకు కారణం 

ఎంపీ దాడి ఘటనలో సీఎం స్పందించాలి 


నల్లగొండ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణలో శాంతి భద్రతల సమస్య నెలకొందని, సీఎం కేసీఆర్‌ ఇందు కు కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన జిల్లా కేంద్రంలోని పలువురు సీనియర్‌ నాయకుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. ఎంపీపై దాడి సంఘటనలో సీఎం స్పందించాలని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. దాడి విషయాన్ని తమ కేంద్ర నాయకత్వానికి, లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని, సీఎం తన ప్రవర్తనను మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. నాడు రాష్ట్రం కోసం నేడు ఉద్యోగాల కోసం తెలంగాణ యువత  ప్రాణాలు తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగి ముత్యాల సాగర్‌ వాట్సప్‌ స్టేట్‌సలో పెట్టుకున్నాడని, ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నామన్నారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 


పరామర్శలు.. విన్నపాలు 

రామగిరి, మర్రిగూడ, కేతేపల్లి: బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర నాయకుడు గోలి మధుసూదన్‌రెడ్డి తల్లి సుశీలమ్మ పెద్ద కర్మకు బండి సంజయ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. అనంతరం మధుసూదన్‌రెడ్డితో మాట్లాడి సానుభూతి తెలిపారు. రెండు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అయితగోని అంజయ్యగౌడ్‌ కుటుంబ సభ్యులను కేతేపల్లిలో పరామర్శించారు.  అదేవిధంగా తమకు పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పరిహారం అందించేలా పోరాటం చేయాలని చర్లగూడెం ముంపు గ్రామాల బాధితులకు బీజేపీ మర్రిగూడ మండల అధ్యక్షుడు చెరుకు శ్రీరాములుగౌడ్‌ ఆధ్వర్యంలో నల్లగొండలో బండి సంజయ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.  అదేవిధంగా తెలంగాణ బీసీ సంక్షేమ ఉమ్మడి జిల్లా అఽధ్యక్షుడు పోగుల సైదులు, జిల్లా నాయకులు శ్రీరామ్‌ చారి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి వినతి పత్రం అందజేశారు.

Updated Date - 2022-01-26T06:58:11+05:30 IST