హెల్మెట్లు, కుక్కర్లు, గ్యాస్‌ సిలిండర్లకు ఐఎస్‌ఐ మార్కు తప్పనిసరి

ABN , First Publish Date - 2021-11-25T08:22:20+05:30 IST

నకిలీ ఐఎ్‌సఐ మార్కుతో మార్కెట్లోకి వస్తున్న గృహోపకరణాలపై వినిమోగదారుల భద్రతా సంస్థ(సీసీపీఏ) దృష్టి సారించింది.

హెల్మెట్లు, కుక్కర్లు, గ్యాస్‌ సిలిండర్లకు ఐఎస్‌ఐ మార్కు తప్పనిసరి

న్యూఢిల్లీ, నవంబరు 24: నకిలీ ఐఎ్‌సఐ మార్కుతో మార్కెట్లోకి వస్తున్న గృహోపకరణాలపై వినిమోగదారుల భద్రతా సంస్థ(సీసీపీఏ) దృష్టి సారించింది. వినియోగదారుల భద్రత దృష్ట్యా ద్విచక్ర వాహనదారులు వాడే హెల్మెట్లు, ఇళ్లలో వినియోగించే ప్రెషర్‌ కుక్కర్లు, వంట గ్యాస్‌ సిలిండర్లపై అసలైన ఐఎ్‌సఐ మార్కు ఉండి తీరాలని, నకిలీలను నిరోధించాలని నిర్ణయించింది. మార్కెట్లలో వీటి చలామణీని అడ్డుకునేందుకు ఇక నుంచి స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తామని సీసీపీఏ బుధవారం ప్రకటించింది. బహిరంగ మార్కెట్లతో పాటు ఆన్‌లైన్‌ విక్రయాల్లోనూ నకిలీల నియంత్రణకు శ్రీకారం చుట్టింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎంమాల్‌ లాంటి 5 ఈ-కామర్స్‌ సంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. నకిలీల విక్రయాలను ప్రోత్సహించొద్దని ఆదేశించింది. స్పెషల్‌ డ్రైవ్‌ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది.

Updated Date - 2021-11-25T08:22:20+05:30 IST