Abn logo
Jul 1 2020 @ 04:39AM

ముంపు ముప్పు నిజమే

కోరుకొండ, రాజానగరంలో ఆవ భూములకు వరద ముప్పు నిజమే

నిర్ధారించిన జేఎన్టీయూ నిపుణుల బృందం 

రెండు సార్లు ఆవ భూముల్లో పర్యటించి అధ్యయనం

రిజిస్ట్రార్‌ ద్వారా కలెక్టర్‌కు నివేదిక పంపిన ఇంజనీర్ల బృందం

వివరాలు గోప్యంగా ఉంచిన అధికారులు

ముంపు ఉందని ఇప్పటికే ఇరిగేషన్‌ నివేదిక


సిటీ న్యూస్ : పేదల ఇళ్ల స్థలాల కింద రాజమహేంద్రవరం అర్బన్‌, రూరల్‌, రాజానగరం మండలాల పరిధిలో 42 వేల మంది లబ్దిదారులకు స్థల సేకరణ చేయాలని అధికారులు మేలో నిర్ణయించారు. దీన్ని అడ్డం పెట్టు కుని అధికార పార్టీలో రాజధాని స్థాయి కీలక నేతలు, జిల్లా స్థాయిలో మరో ముగ్గురు కలిసి స్కెచ్‌ వేశారు. భూసేకరణకు ప్రైవేటు భూములు ఎలాగూ కావలసి ఉండడంతో రాజమహేంద్రవరానికి సమీపంలోని రాజానగరం, కోరుకొండ మండలాల్లో ఆవభూములపై కన్నేశారు. ఇవి చాలా తక్కువ ధర ఉన్న భూములు.


ఎందుకంటే వర్షాకాలం, గోదావరికి వరదలు వచ్చిన ప్పుడు ఈ భూముల్లోకి బురద కాలువ, జల్లకాలువ ద్వారా భారీగా నీరు వచ్చి చేరుతుంది. 15 అడుగుల వరకు ఇవి మునిగిపోతాయి. దీంతో వీటిని ఇళ్ల స్థలా లకు అంటగట్టడానికి ఈ నేతలు వ్యుహరచన చేశారు. అయితే మే 18న  కలెక్టర్‌  పేరుతో ప్రైవేటు భూముల సేకరణకు నోటిఫికేషన్‌ విడుదలైంది. రాజమహేంద్ర వరానికి 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో భూము లు ఇవ్వడానికి ఎవరైనా ముందుకు రావాలని అందు లో ఉంది. ఆ భూములు ముంపు భూములు అయి ఉండకూడదని షరతులు విధించింది. నోటిఫికేషన్‌ నేపథ్యంలో అధికార పార్టీ నేతల వ్యూహం ప్రకారం రెండు మండలాల్లో ఆవ రైతుల నుంచి రెవెన్యూ అధికారులు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు.


కోరుకొండ, రాజానగరం మండలాల పరిధిలో 586 ఎకరాలు సేకరించారు. రూ.18 లక్షలు కూడా పలకని భూమికి రూ.45 నుంచి రూ.62 లక్షల వరకు చెల్లిం పులు చేశారు. పెద్దగా విలువలేని ఆవ భూములకు అంత ధర చెల్లించారని, భారీ వర్షాలు, గోదావరి వరదలకు ఇవి మునిగిపోతాయన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుసగా కథనాలు వెలువడ్డాయి. దీంతో చేసేది లేక ఆవ భూ ములు వరదకు ముంపునకు గురవుతాయా? లేదా? తేల్చడానికి కాకినాడ జేఎన్టీయూ నిపుణుల బృందాన్ని అధ్యయనం కోసం నియమించారు. సివిల్‌ ఇంజనీ రింగ్‌ ప్రొఫెసర్‌ వి.శ్రీనివాసులు, మరో ప్రొఫెసర్‌ జి.అబ్బయ్య, ఏయూ రిటైర్డ్‌ సివిల్‌ ప్రొఫెసర్‌ ఎంఐ నరసింహరావు తదితరులు రెండు  దఫాలుగా ఆవ భూముల్లో పర్యటించారు.


అయిదు ప్రభుత్వ శాఖల నుంచి ఆవ భూముల పరిధి, పరీవాహక ప్రాంతంలో గడిచిన పదిహేనేళ్ల వర్షపాతం వివరాలు, కాంటూర్లు, నీటిపారుదలశాఖ నుంచి కాలువల ప్రవాహం, గోదావరి వరదకు సంబంధించి పాత రికార్డుల నుంచి వివరాలు సేకరించారు. ఇవన్నీ కోడ్రీకరించి ఎట్టకేలకు నివేదిక తయారుచేశారు. దాని ప్రకారం వర్షపాతం ఎంత ఉన్నప్పుడు ఆవ భూములు ఎన్ని అడుగులు మునిగిపోతాయి? వరద ప్రవాహం ఎంత ఉన్నప్పుడు ఏమేరకు ముంపు ఉంటుందనేది అందులో ప్రస్తావిం చారు. మొత్తానికి ఆవ భూములకు వరద ముంపు కచ్చితంగా ఉందని, అయితే భారీ వర్షాలు, వర్షపాతం, వరద స్థాయి ఆధారంగా ముంపు ఉంటుందని నివేది కలో విశ్లేషించినట్టు తెలిసింది. కాగా కోరుకొండ, రాజ మహేంద్రవరం రూరల్‌ మండలాల పరిధిలో బూరు గుపూడి, కొలమూరు గ్రామాల్లోని ఆవ భూములు వరద ముంపునకు గురవుతాయా? ఇది నిజమా? కాదా? తేల్చి నివేదిక ఇవ్వాలని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ జలవనరులశాఖ ధవళే శ్వరం సెంట్రల్‌ డివిజన్‌ విభాగం ఈఈని కోరుతూ మార్చి 7న లేఖ రాశారు.


దీనిపై అదే నెల 12న సదరు ఈఈ సబ్‌కలెక్టర్‌కు తన నివేదిక పంపారు. అందులో ఇళ్లస్ధలాలకు ప్రతిపాదించిన ఆవ భూములు జల్లకాలువకు అతి సమీపంలో ఉన్నాయని, గోదావరికి వరద వస్తే ఈ భూములు మునిగిపోతా యని నివేదికలో సవివరంగా విశ్లేషించారు. దీంతో ఇప్పుడు జేఎన్టీయూ నిపుణుల బృందం కూడా ఇదే విషయాన్ని దాదాపుగా నిర్ధారించింది. అయితే ఈ రెండు నివేదిక నేపథ్యంలో అన్నీ తెలిసి ఆవ భూములు సేకరించడం వెనుక భారీ దోపిడీ స్కెచ్‌ ఉందనే అనుమానాలను బలపరుస్తోంది. కాగా జేఎన్టీ యూ నిపుణుల నివేదిక వివరాలను జిల్లా అధికా రులు అత్యంత గోప్యంగా ఉంచారు. వివరాలు బయ టకు పొక్కనీయడం లేదు. ముంపు కచ్చితంగా ఉం టుందనే నివేదిక బయటకు వస్తే తమకు ఇబ్బం దులు వస్తాయనే అనుమానంతో అధికారులు గోప్యత పాటిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement