పేద రైతు ఇంట పుట్టి.. చెట్టు కింద చదువుకొని.. రోజుకు రూ.153 కోట్లు సంపాదనతో.. భారత్‌లోనే అత్యంత సంపన్నుల జాబితాలోకి

ABN , First Publish Date - 2021-10-10T11:26:54+05:30 IST

జే చౌదరి హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక చిన్న కుగ్రామం అయిన పనోహ్‌లో పుట్టుడు. అతని తండ్రి ఒక పేద రైతు. అతని గ్రామలో కరెంటు, తాగునీరు లాంటి కనీస వసతులు కూడా సరిగా లేవు. ఇలాంటి పరిసరాల్లో పుట్టిన జేకి చదువంటే చాలా ఇష్టం...

పేద రైతు ఇంట పుట్టి.. చెట్టు కింద చదువుకొని.. రోజుకు రూ.153 కోట్లు సంపాదనతో.. భారత్‌లోనే అత్యంత సంపన్నుల జాబితాలోకి

జే చౌదరి హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక చిన్న కుగ్రామం అయిన పనోహ్‌లో పుట్టుడు. అతని తండ్రి ఒక పేద రైతు. అతని గ్రామలో కరెంటు, తాగునీరు లాంటి కనీస వసతులు కూడా సరిగా లేవు. ఇలాంటి పరిసరాల్లో పుట్టిన జేకి చదువంటే చాలా ఇష్టం. ఇంట్లో చదువుకోవడం కష్టంగా ఉండడంతో తన గ్రామంలోని ఓ చెట్టు కింద కూర్చొని చదువుకొనేవాడు. అలా ఎన్నో కష్టాలు పడి జే చౌదరి ఐఐటీ- బెనారస్ హిందూ యూనివర్సటీ నుంచి ఎలాక్టానిక్సి ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. అలాంటి పేదరికంలో పుట్టి ఎన్నో కష్టాలు పడిన జే చౌదరి ఈ రోజు భారత్‌లోని అత్యంత సంపన్నుల జాబితాలో పదవ స్థానంలో నిలిచాడు.


1980వ దశకంలో ఇంకా పై చదువుల కోసం జే చౌదరి అమెరికా వెళ్లారు. అక్కడ ఎంబీఏ మార్కెటింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో రెండు మాస్టర్ డిగ్రీలు సంపాదించాడు. ఆ తరువాత బహుళజాతి సంస్థలైన ఐబియం, యూనిసిస్, ఐక్యూ సాఫ్ట్‌వేర్‌లలో జే ఉద్యోగం చేశారు. 1996లో జే, ఆయన భార్య జ్యోతి ఇద్దరూ తమ భారీ వేతనాలు కలిగిన ఉద్యోగాలకు రాజీనామా చేశారు. తమ వద్ద ఉన్న సేవింగ్స్‌తో ఒక కొత్త కంపెనీ మొదలు పెట్లారు. అలా వారి జీవిత విజయ ప్రయాణం మొదలైంది. ఆ ప్రయాణంలో ఎయిర్ డిఫెన్స్, సిఫర్ ట్రస్ట్, కోర్ హార్బర్, సెక్యూర్ ఐటీ లాంటి కంపెనీలను స్థాపించి.. వాటిని మోటొరోలా, సెక్యూర్ కంప్యూటింగ్, యూస్ఐ ఎటిఅండ్‌టి, వెరిసైన్ లాంటి దిగ్గజ సంస్థలకు మంచి లాభాలకు 1998లో విక్రయించారు.


అలా చివరికి జే చౌదరి జెడ్ స్కేలర్(Zscaler) అనే ఐటీ సెక్యూరిటీ కంపెనీని అమెరికాలోని కాలిఫోర్నియాలో 2007లో స్థాపించారు. ప్రస్తుతం ఆయన భారతదేశ అత్యంత సంపన్నుల జాబితాలో 10వ స్థానం పొందారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్‌ 2021 ప్రకారం జే చౌదరి రోజుకు రూ.153 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన మొత్తం ఆస్తి విలువ రూ. 160 వేల కోట్లు.  ఆయనకు జెడ్ స్కేలర్ కంపెనీలో 42 శాతం వాటా ఉంది. ప్రస్తుతం జెడ్ స్కేలర్ మార్కెట్ క్యాప్ విలువ రూ. 281 వేల కోట్లు.


జీవితంలో తను సాధించిన విజయం గురించి జే చౌదరి ఒక ఇంటర్‌వ్యూలో మాట్లాడుతూ తను జెడ్ స్కేలర్ సంస్థ స్థాపించినప్పుడు మార్కెట్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, కానీ త్వరలో పరిస్థితులు మారబోతున్నట్లు తను అంచనాతో ముందడగు వేశానని ఆయన అన్నారు. మార్కెట్ ఊహించినట్లుగానే పుంజుకోవడంతో తాను కంపెనీని ఈ స్థాయికి తీసుకురాగలిగానని ఆయన చెప్పారు. ప్రస్తుతం జే చౌదరి(62) అమెరికాలోని నెవాడాలో నివసిస్తున్నారు.

Updated Date - 2021-10-10T11:26:54+05:30 IST