ఎర్రగుంట్ల, జనవరి 14: ఎర్రగుంట్ల మండలం పెద్దనపాడు-సర్వరాయసాగర్ గ్రామాల మధ్యలో ఈ నెల 9న బొలెరో ఢీ కొన్న సంఘటనలో గాయపడ్డ నూకనబోయిన జయరాముడు (45) స్విమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు ఎస్‌ఐ క్రిష్ణయ్య తెలిపారు. అలిదెన ఓబాయపల్లెకు చెందిన జయ రాముడు ఈ నెల 9వ తేదీన కూరగాయల కోసం తన వాహనంలో వెళతుండగా పెద్దనపాడు- సర్వరాయ సాగర్ గ్రామాల మధ్యలో బొలేరో ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన జయరాముడిని మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని స్విమ్స్‌లో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడని ఎస్‌ఐ తెలిపారు. వారి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం స్విమ్స్‌కు వెళ్లి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని ఎస్‌ఐ తెలిపారు.