రామకృష్ణుడి చతురత!

ABN , First Publish Date - 2021-03-31T05:43:23+05:30 IST

ఒకరోజు తెనాలి రామకృష్ణుడు తన భార్యతో కలిసి విజయనగర సామ్రజ్యం రాజధాని హంపికి వెళుతున్నారు. మార్గమధ్యంలో వారికి కొండ ప్రాంతంలో ఒక ఊరు కనిపించింది. గ్రామస్థులంతా ఒకచోట పోగవడం చూసి ఇద్దరూ అక్కడకు వెళ్లారు. అక్కడ ఒక కండలు

రామకృష్ణుడి చతురత!

ఒకరోజు తెనాలి రామకృష్ణుడు తన భార్యతో కలిసి విజయనగర సామ్రజ్యం రాజధాని హంపికి వెళుతున్నారు. మార్గమధ్యంలో వారికి కొండ ప్రాంతంలో ఒక ఊరు కనిపించింది. గ్రామస్థులంతా ఒకచోట పోగవడం చూసి ఇద్దరూ అక్కడకు వెళ్లారు. అక్కడ ఒక కండలు తిరిగిన వ్యక్తి ఎడమ చేతిలో 50 కిలోల బియ్యం సంచీ పట్టుకొని, కుడి చేతితో తన మీసాలు మెలేస్తున్నాడు. రామకృష్ణుడి పక్కన ఉన్న ఒకాయన ‘అతడు 500 క్వింటాళ్ల బియ్యం సంచీని మోస్తున్నాడు’ అన్నాడు. వెంటనే రామకృష్ణుడు ‘అదేమంత గొప్ప కాదు. నేను అంతకన్నా వెయ్యి రెట్ల బరువు మోయగలను’ అని అందిరికీ వినిపించేలా అన్నాడు. అందరూ అతడి వంక చూశారు. అప్పుడు రామకృష్ణుడు ‘నేను ఆ కొండను నా భుజాన మోయగలను’ అంటూ దూరాన ఉన్న కొండను చూపిస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. అయితే ఒక షరతు పెడతాడు. ‘అంతపెద్ద కొండను మోయాలంటే నేను బలిష్టంగా తయారవ్వాలి. అందుకు నాకు అరు నెలల సమయం కావాలి’ అంటాడు. అందుకు గ్రామ పెద్ద సరేనంటాడు.


రామకృష్ణుడు, అతడి భార్య ఉండేందుకు గ్రామంలోనే ఒక ఇల్లు, ఆరు నెలలు భోజన వసతి ఏర్పాట్లు చేయిస్తాడు. గడువు తేదీ రాగానే గ్రామస్థులంతా ఆ కొండ దగ్గర పోగవుతారు. రామకృష్ణుడు మధ్యలో కూర్చొంటాడు. గ్రామపెద్ద రామకృష్ణుడితో ‘నువ్వు కొండను ఎత్తడం చూడాలని జనమంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు’ అంటాడు. అప్పుడు ‘మీరందరూ ఆ కొండను ఎత్తి నా భుజాలపై పెడితే నేను మోస్తాను’ అని రామకృష్ణుడు అనగానే అందరూ ఆవాక్కవుతారు. రామకృష్ణుడి తెలివిని మెచ్చుకుంటారు. 

Updated Date - 2021-03-31T05:43:23+05:30 IST