Abn logo
Mar 26 2020 @ 11:46AM

వరుసగా మూడోరోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: కరోనా దెబ్బకి ఇటీవల ఘోరంగా పతనమౌతూ వచ్చిన దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ప్రయాణిస్తున్నాయి. బ్యాంకులు, ఐటీ స్టాక్‌ల దన్నుతో ఇవాళ బీఎస్‌ఈ సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా దూసుకెళ్లగా... నిఫ్టీ సైతం 300 పాయింట్ల మేర పరుగులు పెడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం కట్టుదిట్టంగా అమలవుతుండడంతో పాటు.. అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న సానుకూల పరిస్థితులు కూడా మార్కెట్ మంచి ఊపు తీసుకొస్తున్నాయి.


అమెరికా ఆర్థిక వ్యవస్థకు 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీపై సెనెట్ నాయకులు, శ్వేతసౌదం ఒక అవగాహనకు రావడం ఇన్వెస్టర్లపై సానుకూల ప్రభావం చూపినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు భారత ప్రభుత్వం కూడా రూ.1.5 లక్షల కోట్ల మేర ఆర్ధిక ఉద్దీపనలు ప్రకటించనున్నట్టు వస్తున్న వార్తలు కూడా పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 982.28 పాయింట్ల (3.44 శాతం) లాభంతో 29518.06 వద్ద ట్రేడవుతుండగా... ఎన్ఎస్ఈ నిఫ్టీ 281.60  పాయింట్ల లాభంతో (3.39 శాతం) 8599.45 వద్ద కొనసాగుతోంది.  

Advertisement
Advertisement
Advertisement