Abn logo
Sep 28 2021 @ 00:16AM

భారత బంద్‌ సంపూర్ణం

కళ్యాణదుర్గంలో ట్రాక్టర్లతో భారీ నిరసన ర్యాలీ

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతు సంఘాల సమాఖ్య... సం యుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) సోమవారం నిర్వహించిన భారత బంద్‌ జిల్లాలో విజయవంతమైంది. పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రధాన కూడళ్లలో ర్యాలీగా వెళ్లి నిరసనలతో హోరెత్తించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, బస్సులు, వాణిజ్య సముదాయా లు మూతపడ్డాయి. జనజీవనం స్తంభించింది. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. భారత బంద్‌ సంపూర్ణంగా ముగిసింది.


కళ్యాణదుర్గం, సెప్టెంబరు 27: ప్రధాని నరేంద్రమో దీ రైతులకు తీరని ద్రోహం చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి విమర్శించారు. సో మవారం చేపట్టిన భారతబంద్‌కు టీడీపీ శ్రేణులు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. పట్టణంలోని వాల్మీకి విగ్రహం నుంచి షిరిడీసాయి ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు.  మ హాత్మాగాంధీ, వాల్మీకి, ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల పై పెద్దఎత్తున నినదించారు. అనంతరం టీసర్కిల్‌లో బైఠాయించి వామపక్షాలతో కలిసి వంటావార్పు చేపట్టారు.  ఉ పాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ప ట్టణంలో ట్రాక్టర్లతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. రోడ్డుపై నే భోజనాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నా యకులు ఆర్జీ శివశంకర్‌, మాజీ వైస్‌ ఎంపీపీ గోళ్ల వెంకటేశులు, అనంతపురం పార్లమెంట్‌ తెలుగు మహిళ అధ్యక్షురాలు ప్రియాంక, డీకే రామాంజనేయులు, మారుతిచౌదరి, ఉదయ్‌చౌదరి, కొల్లాపురప్ప, భట్టువానిపల్లి కిషో ర్‌, ఎర్రంపల్లి సత్తి, ములకనూరు కిష్ట, రాయపాటి రామాంజనేయు లు, గోవిందరెడ్డి, గోళ్ల రాము, బొజ్జన్న, మల్లేష్‌ పాల్గొన్నారు.


బీజేపీ ప్రభుత్వం రైతులను నమ్మించి నట్టేట ముంచింద ని టీడీపీ సీనియర్‌ నాయకులు చౌళం మల్లికార్జున, అనంతపురం పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు వైపీ రమే్‌ష విమర్శించా రు. సోమవారం కళ్యాణదుర్గంలో చేపట్టిన భారతబంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం టీ సర్కిల్‌లో బైఠాయించారు. కార్యక్రమంలో నాయకు లు పాపంపల్లి రామాంజనేయులు, గౌని శ్రీనివా్‌సరెడ్డి, సీపీ ఐ జిల్లా కార్యదర్శివర్గసభ్యులు సంజీవప్ప, తాలుకా కార్యద ర్శి గోపాల్‌, అశ్వర్థ, ఊటంకి రామాంజనేయులు, హనుమంతరెడ్డి, వెలుగులోకేష్‌, శర్మస్‌, ఒంటిమిద్ది సత్తి, మునీర్‌, గోపి, బసవరాజు, కుణే సాయినాథ్‌, మోరేపల్లిరాము పాల్గొన్నారు. 


ప్రధాని మోదీకి నూకలు జల్లె సమయం దగ్గర పడిందని మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన దొడగట్ట నారాయణ విమ ర్శించారు. సోమవారం భారతబంద్‌కు మద్దతు తెలుపుతూ కళ్యాణదుర్గంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. వాల్మీకి, మహాత్మాగాంధీ, ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ని వాళులర్పించారు. ప్రైవేట్‌, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, బ్యాంకులను బంద్‌ చేయించారు. కేంద్ర ప్రభుత్వ తీ రును నిరసిస్తూ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన చే పట్టారు. అనంతరం టీసర్కిల్‌లో బైఠాయించి కేంద్ర ప్రభు త్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పట్టణ కన్వీనర్‌ మాదినేని మురళి, పార్లమెంట్‌  కార్యదర్శి తలారి సత్యప్ప, పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లప్ప, అధికార ప్రతినిధి రామరాజు, కన్వీనర్‌ శ్రీరాములు, నాయకులు దండా శ్రీరాములు, పోస్టు పాలన్న, హ నుమంతరాయుడు, పార్లమెంట్‌ ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి పర్వతనేని మధు, కిష్టప్ప, గంగన్న, ఆంజనేయులు, నాగరా జు, బిక్కి గోవిందరాజులు, శీన, బ్రిజే్‌ష చౌదరి, కొల్లాపురప్ప, మనోహర్‌, మంజునాథ్‌, ఎరుకుల హరి, చంద్రశేఖర్‌, సుధాకర్‌, మల్లి, రోషన, చక్రపాణి, జగదీష్‌ పాల్గొన్నారు. 


తాడిపత్రి టౌన: భారతబంద్‌ పట్టణంలో విజయవంతమైంది. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ ఇతర పార్టీల నాయకులు  ద్విచక్రవాహనాల ర్యాలీ చేశారు. పలుచోట్ల షాపులను మూసివేయించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ డౌనడౌన అంటూ నినాదాలు చేశారు. సీపీఐ నియోజకవర్గ అధ్యక్షు డు రంగయ్య, పట్టణ కార్యదర్శి చిరంజీవి, కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి మాట్లాడారు. సా గుచట్టాలతో వ్యవసాయాన్ని కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో పెట్టేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారన్నారు. ఈచట్టాలను రద్దుచేసేంతవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు నరసింహారెడ్డి, సీఐటీయూ నా యకులు జగనమోహనరెడ్డి, ఉమాగౌడ్‌, రైతు సంఘం నా యకులు రాజారామిరెడ్డి, రమణ, కాంగ్రెస్‌ నాయకులు నజీర్‌అహ్మద్‌, బీసీ ఓబులేసు పాల్గొన్నారు. 


కంబదూరు: ప్రజా ఉద్యమాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి బుద్ధి చెప్పేందుకు అందరూ ఏకతాటిగా నిలవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర ణం రామ్మోహనచౌదరి పిలుపునిచ్చారు. సోమవారం భారతబంద్‌లో భాగంగా కంబదూరులో టీడీపీ, వామపక్షాల ఆ ధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆ ర్టీసీ బస్టాండ్‌ నుంచి చెక్‌పోస్టు వరకు సాగిన ర్యాలీలో పె ద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం స్థానిక చెక్‌పోస్టు వద్ద రోడ్డుపై బైఠాయించారు. రామ్మోహనచౌదరి మాట్లాడు తూ రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన పెల్రోట్‌, డీజల్‌, వంటగ్యాస్‌ ధ రలను తగ్గించాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు గాజుల శ్రీరాములు, శివన్న, టీడీపీ నాయకులు తలారి ఎ ర్రిస్వామి, దండా వెంకటేశులు, ఆవుల తిప్పేస్వామి, మానికొండ్ల వెంకటేశులు, తలారి తిమ్మరాయుడు, ఒంటారెడ్డిపల్లి మల్లికార్జున, ఓబుగానిపల్లి సుబ్బరాయుడు, షఫీ, గాజుల రామాంజనేయులు, గంగిరెడ్డి, రామకృష్ణ, అండేపల్లి ము త్యాలు, అమలీ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


కూడేరు: మండల కేంద్రంలో సోమవారం జరిగిన బం ద్‌ విజయవంతమైంది. సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ, బీఎ్‌సపీ, ఎమ్మార్పీఎస్‌, తెలుగుదేశం పార్టీ ల నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. కేంద్ర ప్ర భుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు.


శెట్టూరు: కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని టీడీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో చేపట్టిన భారతబంద్‌ సంపూర్ణంగా ముగిసింది. బస్టాండ్‌ ఆవరణలో ధర్నా, రోడ్డుపై వంటావార్పు చేపట్టా రు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిప్పారెడ్డి, గురుప్రసాద్‌, రంగప్ప, నగేష్‌, కుమార్‌, చంద్రనాయక్‌ పాల్గొన్నారు.  


రాయదుర్గం: కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలు రద్దు చే యాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన బంద్‌ రాయదుర్గంలో సోమవారం విజయవంతమైంది. తెలుగుదేశం పార్టీతో పా టు వామపక్ష, దళిత, ప్రజా, రైతు సంఘాల నాయకులు ఉ దయం నుంచే రోడ్లపైకి వచ్చి బంద్‌లో పాల్గొన్నారు. దుకాణాలు, పెట్రోల్‌ బంక్‌లు, బ్యాంకులు, విద్యాసంస్థలు, పూర్తి గా బంద్‌ చేశారు. బస్సుల రాకపోకలను నిలిపివేశారు. కా ర్యాలయాలను మూయించేశారు. అనంతరం వినాయక స ర్కిల్‌ వద్ద పెద్దఎత్తున తరలివెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. తెలుగు రైతు రాష్ట్ర ఉ పాధ్యక్షులు కేశవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ఆపాలని డిమాండ్‌ చేశా రు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలన్నారు. అనంతరం వాహనాలలో తిరిగి దుకాణాలను బంద్‌ చేయించా రు. ఆల్‌ మర్చంట్స్‌ అసోసియేషన బంద్‌కు మద్దతు ఇచ్చిం ది. కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి సంపత కుమారి, టీఎనఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్‌యాదవ్‌, కౌన్సిలర్‌ ప్రశాంతి, టీడీపీ నాయకులు బం డి భారతి, పొరాళ్లు పురుషోత్తమ్‌, మల్లికార్జున, హనుమం తు, లోకేష్‌, గాజుల వెంకటేశులు పాల్గొన్నారు. 


గుమ్మఘట్ట: రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం మండలంలో బంద్‌ ప్ర శాంతంగా జరిగింది. తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం నాయకులు సంయుక్తంగా మండల కేంద్రంలోని దుకాణాలు, ప్ర భుత్వ కార్యాలయాలను మూసివేయించారు. తహసీల్దార్‌ వెంకటాచలపతికి వినతిపత్రం అందజేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్‌ గిరిమల్లప్ప, సీనియర్‌ నాయకులు దానవేంద్ర, కాలవ సన్నణ్ణ, సదాశివ, చిన్నక్రిష్టయ్య, మూర్తి, సూరి, జయరామిరెడ్డి, నారా లోకేష్‌ ఫౌండేషన అధ్యక్షులు పాలయ్య, హరినాథ్‌, కాలవ నాగరా జు, తిమ్మప్ప, బీటీపీ అంజి పాల్గొన్నారు. 


యాడికి: వ్యవసాయ చట్టాలను కేంద్రప్రభుత్వం వెంట నే ఉపసంహరించుకోవాలని టీడీపీ అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వేలూరు రంగ య్య, సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి వీబీ వెంకటేష్‌, సీపీఎం మండల ప్రధాన కార్యదర్శి బషీర్‌అహమ్మద్‌ తెలిపారు. సోమవారం యాడికిలో టీడీపీ, సీపీఐ, సీపీఎం పా ర్టీలు భారతబంద్‌లో భాగంగా రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, దుకాణా లు, స్కూళ్లు మూసి వేయించారు. కార్యక్రమంలో టీడీపీ నా యకులు చరణ్‌, హరి, నెట్టికంటయ్య, శేఖర్‌, శోభనబాబు, జాఫర్‌, నరేంద్రబాబు, గుర్రప్ప, సుంకన్న, రామానాయుడు, రామాంజనేయులు, హరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.


పెద్దవడుగూరు: మండలకేంద్రంతో పాటు కిష్టిపాడు గ్రామంలో టీడీపీ నాయకులు కేశవరెడ్డి, చిరంజీవి, బాల్‌రె డ్డి, రవిశేఖర్‌రెడ్డి, సీపీఐ, సీపీఎం నాయకులు భారతబంద్‌ చేపట్టారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు దస్తగిరి, వ్య వసాయ కార్మిక సంఘం నాయకులు వెంకటరాముడుయాదవ్‌, సీపీఐ నాయకులు కృష్ణనారాయ పాల్గొన్నారు.


యల్లనూరు: భారతబంద్‌ మండలంలో పాక్షికంగా జరిగింది. విద్యాసంస్థలు, బ్యాంకులు మూతపడగా, వ్యాపారసంస్థలు, కార్యాలయాలు యథావిధిగా కొనసాగాయి. రైతుసంఘం నాయకులు సుబహాన పాల్గొన్నారు.


పుట్లూరు: మండలంలోని ఏ కొండాపురం గ్రామంలోని ప్రధాన రహదారిని సీపీఎం నాయకులు బంద్‌ చేసి నిరస న వ్యక్తంచేశారు. ప్రభుత్వ కార్యాలయాలను బంద్‌ చేయించారు. నాయకులు రామాంజి, సూరి పాల్గొన్నారు.


బొమ్మనహాళ్‌: భారత బంద్‌లో భాగంగా బొమ్మనహాళ్‌లోని దేవగిరి క్రాస్‌ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు కేశవరెడ్డి, టీడీపీ మండల కన్వీన ర్‌ బలరామిరెడ్డి, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షులు కొత్తపల్లి మల్లికార్జున ఆధ్వర్యంలో రోడ్డెక్కారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచలు బెళ్లి హనుమంతరెడ్డి, ఎస్‌పీ నాగరాజు, టీడీపీ సీనియర్‌ నాయకులు అప్పారావు, మహేంద్ర, మోహన, ధనుంజయ, దేవగిరి క్రాస్‌ శీన, నాగరాజు, గోరంట్ల వెంకటేశులు, గోవిందు, చంద్రగిరి ధనుంజయ రెడ్డి, కావలి రాము, యర్రగుంట్ల వెంకటేశులు పాల్గొన్నారు. 


డీ హీరేహాళ్‌:  భారత బంద్‌లో భాగంగా మండల కేం ద్రంలో తెలుగుదేశం, సీపీఎం, సీపీఐ నాయకులు ఉదయం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాల ను బంద్‌ చేయించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ తి ప్పేస్వామి, సీపీఎం మండల కార్యదర్శి లోకేష్‌, గొడిశెలపల్లి మల్లికార్జున, తిప్పేస్వామి పాల్గొన్నారు. 


కణేకల్లు: మండల వ్యాప్తంగా భారత బంద్‌ విజయవంతమైంది. ఉదయం నుంచే టీడీపీ, సీపీఐ, సీపీఎం నాయ కులు చిన్నపరెడ్డి సర్కిల్‌ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. స్వచ్ఛందంగా దుకాణాలను బంద్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు లాలెప్ప, ఆనంద్‌, అనిల్‌ కుమార్‌, షేక్‌ ముజ్జు, మా రుతి పాల్గొన్నారు. 


కుందుర్పి: మండల కేంద్రంలో నల్లచట్టాలను రద్దు చే యాలని వినూత్న రీతిలో సోమవారం టీడీపీ, వామపక్షా ల ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. కెనరా బ్యాంకు ముం దు రాస్తారోకో చేశారు. టీడీపీ కార్యకర్త హనుమంతరాయుడు అర్ధ శిరోముండనం చేయించుకుని వినుత్న రీతిలో నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీన ర్‌ ధనుంజయ, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాసులు, నా యకులు పెద్ద నరసింహప్ప, మాజీ ఎంపీపీ మల్లికార్జున,  సర్పంచు మల్లికార్జున పాల్గొన్నారు.

  

గుంతకల్లు టౌన: అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో చేపట్టిన భారత బంద్‌ పాక్షికంగా జరిగింది. టీడీపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, కాంగ్రెస్‌, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. ద్విచక్ర వాహనాల్లో తిరుగుతూ షాపులను, దుకాణాలను బంద్‌ చే యించారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. సి నిమాహాళ్లు, బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, క ళాశాలలు తెరచుకోలేదు. మున్సిపల్‌ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మె ల్యే జితేంద్రగౌడు మాట్లాడుతూ మూడు నల్ల చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీ పీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, కార్యదర్శులు గుమ్మనూరు వెంకటేశ, ఆటో ఖాజ, కౌన్సిలర్‌ పవనకుమార్‌ గౌడు, నాయకులు అనిల్‌కుమార్‌ గౌడు, రామన్న చౌదరి పాల్గొన్నారు.


గుత్తి: పట్టణంలో భారత బంద్‌ విజయవంతమైంది. సోమవారం ఉదయం  వామపక్ష నాయకులు బ్యాంకులను  మూసివేయించారు. హోటళ్లు, సినిమా ధియోటర్లు, పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. స్థానిక గాంధీ స ర్కిల్‌ నుంచి అనంతపురం రోడ్డు, తాడిపత్రి రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు. గాంధీ సర్కిల్‌లో రాస్తారోకో చేపట్టగా వాహనాల రాకపోకలు స్తంభించాయి. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌, పట్టణ, మండల క న్వీనర్లు రవిశంకర్‌ గౌడు, బర్దీవలి, మాజీ జిల్లా కార్యదర్శి శ్రీకాంత చౌదరి, మాజీ ఎంపీపీ వీరభద్రయ్య, మాజీ మా ర్కెట్‌యార్డు చైర్మన శ్రీనివాస యాదవ్‌, సాగునీటిసంఘం అధ్యక్షుడు కేశవ నాయుడు, టీడీపీ నాయకులు సుధాకర్‌ నాయుడు, గోవర్ధన, అగ్గిరాముడు, బెస్త పురుషోత్తం, శ్రీనివాస చౌదరి, అబ్దుల్‌ వహబ్‌, పులికొండ, కోనంకి కృష్ణ, టౌ న  బ్యాంకు ఉపాధ్యక్షుడు కృష్ణా,  సర్పంచ భరతకుమార్‌, ఎంపీటీసీలు నారాయణస్వామి, ధనుంజయ పాల్గొన్నారు.


పామిడి: టీడీపీ, వామపక్షాలు, బీఎస్పీ సోమవారం మండలంలో చేపట్టిన భారత బంద్‌ విజయవంతమైంది.  కార్యక్రమంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బొల్లు శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్‌ అలధ్యక్షుడు ఎంహెచ లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన గౌస్‌పీరా, మాజీ ఎం పీటీసీ సంజీవ, మాజీ కౌన్సిలర్లు వైయూ రామాంజినేయు లు, మహబుబ్‌బాషా, టీడీపీ నాయకులు  రామలింగారెడ్డి, రామాంజినేయులు, సుదర్శన, వడ్డే శివ, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్‌, మండల కన్వీనర్‌ ముసలిరెడ్డి, పట్టణఅధ్యక్షుడు బొమ్మా మోహనకృష్ణ పాల్గొన్నారు.


ఉరవకొండ: పట్టణంలో భారత బంద్‌కు విద్యాసంస్థ లు, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసేసి సంఘీభా వం ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యా యి. వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బ్యాంకులను మూసివేయించారు. టీడీపీ సంపూర్ణమద్దతు ప్రకటించింది.  పార్టీ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీని నిర్వహించారు. స్థానిక కవి తా హోటల్‌ సర్కిల్‌లో ప్రధాన రహదారిపై బైఠాయించి ధ ర్నా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దేవినేని పురుషోత్తం, రేగాటి నాగరాజు, విజయ భాస్కర్‌, నూ తేటి వెంకటేష్‌, రామాంజినేయులు, తిమ్మప్ప, కుళ్లాయప్ప, ప్యారం కేశవనందా, గోవిందు, సుధాకర్‌, రాజుగోపాల్‌, రా జేష్‌, వామపక్షపార్టీల నాయకులు పాల్గొన్నారు. 


విడపనకల్లు: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై సీపీఐ, సీపీఎం అధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. నాయకులు ఎం చెన్నరాయుడు, తిమ్మయ్య,  రమేష్‌,  రుద్రన్న, రామాంజినేయులు పాల్గొన్నారు.


వజ్రకరూరు: మండల కేంద్రంలోని ఏటీఎం సర్కిల్‌ వ ద్ద విద్యార్థి సంఘాలు, టీడీపీ మద్దతుగా బంద్‌ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలను బంద్‌ చేయించారు.  


బెళుగుప్ప: మండలకేంద్రంలో వామపక్షాలు నిర్వహించిన భారత బంద్‌ ప్రశాంతంగా జరిగింది. సీఐటీయూ నా యకులు, హమాలీలు పాల్గొని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, బ్యాంకులను మూయించారు.. బెళుగుప్ప, తగ్గుప ర్తి, నరసాపురం గ్రామాల్లో సీఐటీయూ బంద్‌ చేపట్టింది.