విధులకు వెళ్లిన నర్సుకు షాకింగ్ అనుభవం.. సిబ్బంది అంతా చూస్తుండగా ఓ వ్యక్తి చేసిన పని..

ABN , First Publish Date - 2022-01-08T03:07:38+05:30 IST

బీహార్‌లోని జాముయి జిల్లాలోని గ్రాస్‌రూట్‌ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా నర్సు విధులకు హాజరుకాలేదు. దీంతో ఉన్నతాధికారులు ఆమెను మందలించారు. మరుసటి రోజు విధులకు వెళ్లిన ఆమెను..

విధులకు వెళ్లిన నర్సుకు షాకింగ్ అనుభవం.. సిబ్బంది అంతా చూస్తుండగా ఓ వ్యక్తి చేసిన పని..

పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులు తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక్కోసారి షాకింగ్ ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. వివిధ కారణాలతో ఉద్యోగుల మధ్య వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. ఇటీవల బీహార్‌లోని ఓ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. విధులకు వెళ్లిన నర్సుకు వింత అనుభవం ఎదురైంది..


బీహార్‌లోని జాముయి జిల్లాలోని గ్రాస్‌రూట్‌ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా నర్సు విధులకు హాజరుకాలేదు. దీంతో ఉన్నతాధికారులు ఆమెను మందలించారు. మరుసటి రోజు విధులకు వెళ్లిన ఆమెను అధికారులు మళ్లీ మందలించారు. ఇంతలో ఓ వ్యక్తి జోక్యం చేసుకుని ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆమె కూడా ఆ వ్యక్తిపై దురుసుగా ప్రవర్తించింది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి.. నర్సుపై చేయి చేసుకున్నాడు. ఉన్నట్టుండి జరిగిన ఈ ఘటనతో నర్సు కూడా తీవ్ర ఆవేదనకు గురైంది. అక్కడే ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. గొడవ పెద్దది కాకుండా అక్కడున్న వారంతా ఇద్దరికీ సర్దిచెప్పి పంపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంతా చూస్తుండగా.. పెళ్లి మండపంపై వరుడిని కౌగిలించుకున్న యువతి.. చివరలో ట్విస్ట్ ఏంటంటే..





Updated Date - 2022-01-08T03:07:38+05:30 IST