సీపీఎస్‌ రద్దు చేయలేమనడం మోసమే

ABN , First Publish Date - 2022-06-26T07:36:08+05:30 IST

సీపీఎస్‌ రద్దు చేయలేమనడం మోసమే

సీపీఎస్‌ రద్దు చేయలేమనడం మోసమే

ప్రభుత్వంపై ఒంటేరు, పాలేల ఆగ్రహం

అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను రద్దు చే యలేమని అనడం సీపీఎస్‌ ఉద్యోగులను మోసం చేయడమేనని ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పాలేల రామాంజనేయు లు యాదవ్‌ అన్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తామంటేనే ఉద్యోగులంతా ఓట్లు వేశారని, ఇప్పుడు రద్దుచేయబోమనడం దారుణమన్నారు. ఎప్పుడో ఇవ్వబోయే ఫించను గురించి కాకిలెక్కలు వేసి ఆర్థిక భారం పడుతుందని చెప్పడం సమంజసం కాదన్నారు. దశాబ్దాల పాటు ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగి పదవీ విరమణ తర్వాత పింఛను లేకుండా ఎలా జీవిస్తారని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ప్రశ్నించారు.  ఇప్పటికైనా సీఎం స్పందించి సీపీఎస్‌ విధానాన్ని మళ్లీ తీసుకురావాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.


Updated Date - 2022-06-26T07:36:08+05:30 IST