‘పట్టణ ప్రగతి’ ప్రభావం కనిపించాలి

ABN , First Publish Date - 2020-02-20T10:31:47+05:30 IST

పల్లెప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల

‘పట్టణ ప్రగతి’ ప్రభావం కనిపించాలి

అధికారులతో సమీక్షలో కలెక్టర్‌ కర్ణన్‌



ఖమ్మం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 19: పల్లెప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల ప్రభావం స్పష్టంగా కనిపించాలని  కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ ఆదేశించారు. బుధవారం మునిసిపల్‌, విద్యుత్‌శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈనెల 24నుంచి పది రోజుల పాటు ఖమ్మం నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని మూడు మునిసిపల్‌ ప్రాంతాల్లో చేపట్టనున్న పనులపె ౖవార్డుల వారీగా నివేదికలను అందించాలని ఆదేశించారు. ప్రధానంగా విద్యుత్‌ సమస్య లపై దృష్టిసారించాలని, ట్రాన్స్‌ఫార్మర్ల పనులు రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాల మార్పు, అదనపు స్తంభాల ఏర్పాటు చేపట్టాలన్నారు. పారిశుధ్యం, హరితహారం, తాగునీటి సరఫరాలో సమస్యలు లేకుండా మునిసిపల్‌ కమిషనర్లు చూడాలన్నారు.


ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ... నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన మిషన్‌భగీరథ, సీఎం హామీలు, ఎల్‌ఆర్‌ఎస్‌ పనులపై ప్రత్యేక దృష్టిసారించి పూర్తిచేయాలన్నారు. స్థానిక సంస్థల కలెక్టర్‌ స్నేహలత, శిక్షణ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ రమేష్‌, వైరా, సత్తుపల్లి, మధిర మునిసిపల్‌ కమిషనర్లు విజయానంద్‌, మీనన్‌, దేవేందర్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్యాంప్రసాద్‌, రవాణాశాఖ అధికారి కృష్ణారెడ్డి, నగరపాలక సంస్థ డీఈ రంగారావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-20T10:31:47+05:30 IST