నిబంధనలు సవరించాలంటూ ఐఎంఏ వినతి

ABN , First Publish Date - 2020-02-20T06:55:03+05:30 IST

ఎత్తైన భవనాల్లో ఉన్న ఆస్పత్రుల నిర్వహణకు అగ్ని మాపకశాఖ (ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌) నుంచి నిరభ్యంతర పత్రం

నిబంధనలు సవరించాలంటూ ఐఎంఏ వినతి

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 19 : ఎత్తైన భవనాల్లో ఉన్న ఆస్పత్రుల నిర్వహణకు అగ్ని మాపకశాఖ (ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌) నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తీసుకోవాల్సిన నిబంధనలకు సవరణలు చేయాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు (ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌) డాక్టర్‌ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలోని సంఘ నాయ కులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని బుధవారం కలుసుకుని వినతిపత్రాన్ని అందించారు. ఆ వివరాలను ఏలూరులో పత్రికలకు విడుదల చేశారు.


ఇప్పటి వరకు ఆరు మీటర్ల ఎత్తు ఉన్న భవనాల్లో నిర్వహించే ఆస్పత్రులకు ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఎన్‌వోసీ తీసుకోనవసరం లేదని, ఈ నిబంధనను 15 మీటర్ల ఎత్తు వరకు పొడిగించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించామని సంఘ నాయకులు వివరించారు. ఆ మేరకు జీ ప్లస్‌ 4 వరకు ఫైర్‌ సేఫ్టీ ఎన్‌వోసీ అవసరం లేకుండా చూస్తానని ప్రభుత్వ సలహాదారు హామీ ఇచ్చారని వివరించారు. సలహాదారుని కలిసినవారిలో ఐఎంఏ నాయకులు డాక్టర్‌ రెహ్మాన్‌, డాక్టర్‌ సి.ప్రసాదరావు, డాక్టర్‌ వెంకటేశ్వర్లు, డాక్టర్‌ మధుసూధనశర్మ, తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2020-02-20T06:55:03+05:30 IST