Abn logo
Sep 22 2021 @ 23:41PM

సరస్వతీదేవి విగ్రహం ధ్వంసం

ధ్వంసానికి గురైన విగ్రహం ఇదే..
వజ్రపుకొత్తూరు: గోవిందపురం ఉన్నత పాఠశాల ఆవరణలో సరస్వతీ దేవి విగ్రహంపై మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. బుధవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విగ్రహం ఎడమ చేయి విరిగిపోవడంతో గుర్తించిన హెచ్‌ఎం లింగరాజు వజ్రపుకొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ రాము, ఎస్‌ఐ గోవిందరావులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు ప్రారంభించారు. నందిగాం మండలం ప్రతాప విశ్వనాథపురం గ్రామానికి చెందిన బమ్మిడి జగన్నాథరావు, ఈశ్వరరావులే ఘాతుకానికి పాల్పడినట్టు విచారణలో తేలింది. మద్యం మత్తులో ఘటనకు పాల్పడ్డారని..వారిపై కేసు నమోదు చేసినట్టు వజ్రపుకొత్తూరు పోలీసులు తెలిపారు.