ఆదర్శనీయుడు వాల్మీకి మహర్షి

ABN , First Publish Date - 2021-10-21T05:46:02+05:30 IST

రామాయణ సృష్టికర్త వాల్మీకి మహర్షి నేటి సమా జానికి ఆదర్శనీయుడని వాల్మీకిసంఘం నాయకుడు బోయ రవిచంద్ర పేర్కొన్నారు

ఆదర్శనీయుడు వాల్మీకి మహర్షి
దర్మవరంలో వాల్మీకి విగ్రహం వద్ద పూజలు నిర్వహిస్తున్న దృశ్యం

ఘనంగా జయంతి వేడుకలు

ధర్మవరం, అక్టోబరు20: రామాయణ సృష్టికర్త వాల్మీకి మహర్షి నేటి సమా జానికి ఆదర్శనీయుడని వాల్మీకిసంఘం నాయకుడు బోయ రవిచంద్ర పేర్కొన్నారు.  బుధవారం వాల్మీకి జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని బోయవీధిలో, ప్రభు త్వాస్పత్రి వద్ద  ఉన్న వాల్మీకి విగ్రహాలకు టీడీపీ నాయకులు, వాల్మీకులు పూజలు చేసి  పూలమాలలు వేసి  ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మా ట్లాడుతూ వాల్మీకి మహర్షి ఆశయాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ నడుచుకోవా లన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వాల్మీ కులు తలారి చంద్రమోహన్‌బాబు, జింకల రాజన్న, డిష్‌లచ్చి, చీమల రామాంజి, చీమల నాగరాజు, బొట్టుకిష్ట, జంగం నరసింహులు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 

టీడీపీ ఆధ్వర్యంలో... వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ప్రభుత్వాస్పత్రి వద్దగల వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, పురుషోత్తం గౌడ్‌, మేకల రామాంజినేయులు, చింతపులుసు పెద్దన్న, భీమనేని ప్రసాద్‌నాయుడు, జమీర్‌అహమ్మద్‌, రాంపురంశీ, డిష్‌ లచ్చి, చిగిచెర్ల రాఘవరెడ్డి, చిన్నూరు విజ య్‌చౌదరి, తోటవాసుదేవ, మారుతీస్వామి తదితరులు పాల్గొన్నారు.

కొత్తచెరువు: వాల్మీకిమహర్షి రామాయణాన్ని రచించి ఎందరికో ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యేదుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి తెలిపారు. బుధవారం వాల్మీకిజయంతి కార్యక్రమానికి కొత్తచెరువుకు విచ్చేసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.ఈ కార్యక్ర మంలో మండల కన్వీనర్‌ జగన్మోహన్‌రెడ్డి, ఎంపీపీ రంగారెడ్డిగారిగాయుత్రీ, సర్పంచ్‌ రాధానాగరాజు, జడ్పీటీసీ గంగాదేవి, ఉపాధ్యక్షురాలు సరళ, నాయకులు, కార్యకర్తలు, వాల్మీకిసంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T05:46:02+05:30 IST