పేదల ఇళ్లను కూల్చే ఆలోచన విరమించుకోవాలి

ABN , First Publish Date - 2022-05-22T05:23:10+05:30 IST

పేదల ఇళ్లను కూల్చే ఆలోచనను ఉపసం హరించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, నగర కార్యదర్శి వెంకటశివ పేర్కొన్నారు.

పేదల ఇళ్లను కూల్చే ఆలోచన విరమించుకోవాలి
ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం

ఆర్‌డీఓకు వినతి పత్రం

కడప(సెవెనరోడ్స్‌), మే 21: పేదల ఇళ్లను కూల్చే ఆలోచనను ఉపసం హరించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, నగర కార్యదర్శి వెంకటశివ  పేర్కొన్నారు. శనివారం బాధితులు సీపీఐ నేతృత్వంలో కడప ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ కడప నగరం 14వ డివిజన పరిధిలో గల ఎన్టీఆర్‌ నగర్‌, ప్రకా్‌షనగర్‌, గీతా ముఖర్జీ నగర్‌ ప్రాంతంలో 30 సంవత్సరాలగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చే ఆలోచన విరమించుకోవాలన్నారు. 20 అడుగుల పైగా ఉన్న వరద నీటి కాలువను 50 అడుగుల వెడల్పు చేయాలనే రెవెన్యూ అధికారుల ఆలోచనను విరమించుకోవాలన్నారు. కలెక్టరేట్‌, రిమ్స్‌ మెయిన రోడ్డు, ఎన్టీఆర్‌ నగర్‌ కల్వర్టు వద్దనుంచి ప్రకా్‌షనగర్‌ మెయిన రోడ్డు వరకు గల ఈ నీటి కాలువలో నీళ్లు సాఫీగా వెళ్లడానికి సక్రమంగా కట్టడం లేదన్నారు. వరద కాలువ వెడ ల్పు పేరుతో ఇరువైపులా ఇళ్లు పడగొట్టి పేదలను నిరాశ్రయులుగా మా ర్చే అధికారుల ఆలోచనలు సరికాదన్నారు. గతంలో ఎప్పుడూ వరద నీరు ఎక్కువగా వచ్చేది కాదని, రైల్వేట్రాక్‌ పై భాగాన ఉన్న నీటి కాలువలు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల ధాటికి కనుమరుగయ్యాయన్నారు. ఎన్టీఆర్‌ నగర్‌ నుంచి ప్రకాశనగర్‌ మెయిన రోడ్డు వరకు ఉన్న కాలువ వెడల్పు బుద్దటౌనషి్‌ప దగ్గర ఉండే బచారావు చెరువు వరకు లేదని, దీంతో ప్రకాశనగర్‌ కట్ట కింద పంట కాలువలు తూములు కనుమరుగై పరిసర ప్రాంతాలు నీటిమయమవుతున్నాయన్నారు. అఽధికార యం త్రాంగం అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ, జిల్లా కార్యవర్గ సభ్యుడు కృష్ణమూర్తి, నగర కార్యవర్గ సభ్యుడు బాదుల్లా, పగడపూల మల్లిఖార్జున, భాగ్యలక్ష్మి, ఆవుల నారాయణ, ప్రకా్‌షనగర్‌, ఎన్టీఆర్‌నగర్‌, గీతాముఖర్జీ వాసులు రజియాసుల్తానా, తిరుపతమ్మ, లక్ష్మీదేవి, కళావతి, నాగరాజు, రాముడు, రాములమ్మ, ఆదిలక్ష్మి, శ్రీనివాసులు, సాలమ్మ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T05:23:10+05:30 IST