ఆర్‌ఈసీఎస్‌ రద్దు యోచన సిగ్గుచేటు

ABN , First Publish Date - 2021-01-16T05:06:12+05:30 IST

ఆర్‌ఈసీఎస్‌ (కశింకోట)ను రద్దు చేయాలని చూడడం సిగ్గుచేటని విపక్షాల నాయకులు అన్నారు.

ఆర్‌ఈసీఎస్‌ రద్దు యోచన సిగ్గుచేటు
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

విపక్షాల నాయకులు


అనకాపల్లి టౌన్‌, జనవరి 15: ఆర్‌ఈసీఎస్‌ (కశింకోట)ను రద్దు చేయాలని చూడడం సిగ్గుచేటని విపక్షాల నాయకులు అన్నారు. శుక్రవారం దొడ్డిరామునాయుడు భవనంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, ఆర్‌ఈసీఎస్‌ వల్ల ఈ ప్రాంత రైతులు, గృహ వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. అలాగే ఫార్మాసిటీ, పారిశ్రామికవాడ, కొప్పాక వంటి ప్రాంతాల్లో పరిశ్రమలకు కూడా సేవలందిస్తున్న ఆర్‌ఈసీఎస్‌ను రద్దు చేయాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి సిఫారసు చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌, సీపీఐఎంఎల్‌, సీఐటీయూ నాయకులు ఎ.బాలకృష్ణ, వైఎన్‌ భద్రం, ఐఆర్‌ గంగాధర్‌, పీఎస్‌ అజయ్‌కుమార్‌, మళ్ల సత్యనారాయణలు తదితరులు పేర్కొన్నారు.

Updated Date - 2021-01-16T05:06:12+05:30 IST