ఉన్నది ఒక్కటే.. హుజూరాబాద్‌!

ABN , First Publish Date - 2021-07-25T08:56:28+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకం గా తీసుకున్న టీఆర్‌ఎస్‌.. గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న పలు నిర్ణయాలు...

ఉన్నది ఒక్కటే.. హుజూరాబాద్‌!

  • రోజూ మంత్రుల పర్యటనలు
  • ఎక్కువ సంఖ్యలో ఉన్న ఎస్సీ ఓటర్లు
  • పైలెట్‌ ప్రాజెక్టుగా ‘దళిత బంధు’కు శ్రీకారం

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకం గా తీసుకున్న టీఆర్‌ఎస్‌.. గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.  ఇటీవలి కాలంలో ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న పలు నిర్ణయాలు.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికను ప్రభావితం చేసేలా ఉంటున్నాయని రాజకీయ వర్గా లు విశ్లేషిస్తున్నాయి. 45వేల వరకు ఎస్సీల ఓట్లు ఉండడంతో ఈ వర్గాలను ఆకర్శించడమే లక్ష్యంగా నిర్ణయా లు వెలువడుతున్నట్లు చెబుతున్నారు.  ఈటలకు సన్నిహితునిగా మెలిగిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్‌ పోస్టును రెన్యూవల్‌ చే సింది. దళిత బంధు పథకాన్ని  పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చే యడంలో రాజకీయ ప్రయోజనా న్నీ ఆశిస్తున్నట్లు సీఎం కేసీఆరే స్వయంగా సంకేతాలు ఇచ్చారు. 


ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ నియామకం!

ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిలోనూ హుజూరాబాద్‌ కు చెందిన బండా శ్రీనివా్‌స ను  నియమించారు. ఇలా ఎస్సీ ఓటర్లను ఆకర్శించే కా ర్యక్రమాలతో పాటుగా.. బీసీ లు, ఇతర వర్గాలను ఆకర్శించేందుకూ కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటోంది. పెన్షన్లకు అర్హత వయస్సు ను 57 ఏళ్లకు కుదించడం, రోడ్ల అభివృద్ధికి రూ. 390కోట్ల వరకూ నిధులు ఖర్చు చేయడం ఇతర వర్గాలను ఆకర్శించేందుకేనని చెబుతున్నారు. ఈటల సామాజిక వర్గానికే చెందిన గీస భిక్షపతి ముదిరాజ్‌ను కొమురెల్లి దేవస్థానం చైర్మన్‌గా నియమించడంలోనూ ఆ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చే సుకునే వ్యూహం ఉందన్న ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా టీఆర్‌ఎస్‌  ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ప్రతి రోజూ మంత్రులు పర్యటిస్తున్నారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. 


‘దళిత బంధు’ను మోత్కుపల్లి ప్రశంసించేలా స్కెచ్‌!

బీజేపీలో తనకు ప్రాధాన్యం దక్కక పోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీకి రాజీనామా చేయ డం, అనంతరం ఈటల రాజేందర్‌పైన తీవ్ర స్థాయిలో వి రుచుకు పడడం, దళిత బంధు పథకంపై ప్రశంసల జల్లు కురిపించడం వెనుకా అధికార పార్టీ స్కెచ్‌ ఉందని కమల దళ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎస్సీ ఓటర్లలో అత్యధికులు మాదిగ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. ఆ వర్గం నేత మోత్కుపల్లితో ఈటలపై విమర్శలు, దళిత బంధుపై ప్రశంసలు కురిపించారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.


Updated Date - 2021-07-25T08:56:28+05:30 IST