మహాగాంలో దొంగల హల్‌చల్‌

ABN , First Publish Date - 2021-04-18T06:03:09+05:30 IST

మండలంలోని మాహాగాం గ్రామంలో శుక్రవారం రాత్రి ముగ్గురు సభ్యులున్న దొంగల ముఠా హల్‌చల్‌ చేసింది.

మహాగాంలో దొంగల హల్‌చల్‌
దొంగలదాడిలో గాయపడ్డ వ్యక్తి

భైంసా, ఏప్రిల్‌ 17 : మండలంలోని మాహాగాం గ్రామంలో శుక్రవారం రాత్రి ముగ్గురు సభ్యులున్న దొంగల ముఠా హల్‌చల్‌ చేసింది. శివారుప్రాంతం మీదు గా గ్రామంలోకి చొరబడిన దొంగల మూఠ మొదట చివరివిధిలో ఆరుబయట నిద్రి స్తున్న సాగరబాయి అనే మహిళ మెడ నుంచి పుస్తెలతాడును లాక్కేల్లేందుకు యత్నించారు. ఈ సమయంలో సాగర బాయి నిద్ర నుంచి మేలుకొని అరుపులు వేస్తుండగానే దొంగలు ఆమె మెడలోని పుస్తెలతాడును అపహరించుకొని పారిపోయారు. ఈ ఘటనలో సాగర బాయి మెడకు స్వల్పంగా గాయం అయింది. అనంతరం దొంగలు ఒడ్డెరకాలనీకి వెళ్లి అక్కడ ఒక ఇంట్లోకి చోరీకి యత్నించారు. ఈ సమయంలో ఇంటి యజమాని నర్సింహులు దొంగల అలికిడిని విని కేకలు వేశారు. అప్పటికే ఇంట్లోకి చొరబడిన దొంగలు నర్సింములు భార్యమెడలో నుంచి పుస్తెలతాడును లాక్కున్నారు. ఈ సమయంలో కర్రతో దొంగలను అడ్డుకునేందుకు యత్నించిన నర్సింమ్ములును దొంగలురాళ్ళతో దాడిచేయగా తలకు గాయమైంది. అక్కడి నుంచి దొంగలు సమీ ప ప్రాంతంలోని సంతూమహారాజ్‌ ఇంటికి వెళ్లి చోరీకి విఫలయత్నం చేశారు. దొంగలరాకను గమనించిన సంతుమహారాజ్‌ కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. గంటన్నరపాటు దొంగలు మహాగాంలో హల్‌చల్‌ చేశారు. సమాచారం అందుకున్న ఆయా కాలనీల వాసులు దొంగలను పట్టుకునేందుకు చర్యలు చేపట్టగా అప్పటికే వారు గ్రామాన్ని విడిచి పారిపోయారు. సంబంధిత సమాచారాన్ని అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి ఘటన వివరాలను సేకరిం చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దొంగల ఆచూకి కోసం చర్యలు తీసుకుంటామన్నారు. 


Updated Date - 2021-04-18T06:03:09+05:30 IST