Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 08 Jan 2022 21:44:16 IST

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఒక్క విషయంలో ప్రజలు ఎగతాళి చేస్తున్నారని.. భార్యతో ఇలా అనడంతో..

twitter-iconwatsapp-iconfb-icon
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఒక్క విషయంలో ప్రజలు ఎగతాళి చేస్తున్నారని.. భార్యతో ఇలా అనడంతో..ప్రతీకాత్మక చిత్రం

ప్రేమికులు పెళ్లి చేసుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. పెద్దలను ఎదురించడానికైనా కొందరు వెనుకాడరు. తాము అనుకున్నది జరగకపోతే ఆఖరికి ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడరు. అయితే గుజరాత్‌‌లో ఓ ప్రేమజంట.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది. కాపురం కూడా సవ్యంగా సాగుతోంది. అయితే గ్రామస్తులంతా అన్న ఒక్క మాటతో భర్తలో మార్పు వచ్చింది. ఓ రోజు భార్యతో తన మనసులోని మాట చెప్పడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే..

గుజరాత్ అహ్మదాబాద్‌లో మెమాగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 20 ఏళ్ల యువకుడు, 24ఏళ్ల యువతి ప్రేమించుకున్నారు. వీరిలో యువకుడు అగ్రకులానికి చెందినా వాడు కాగా, యువతి ఎస్సీ సామాజిక వర్గం. అయినా ప్రేమించుకున్నారు. చివరకు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు వీరి సంసారం సవ్యంగా సాగింది. అయితే తర్వాత నుంచి గ్రామస్తులు హేళన చేయడం మొదలెట్టారు. అగ్ర కులానికి చెందిన వాడివై ఉండి.. ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా.. అంటూ ఎగతాళి చేయడం ప్రారంభించారు. కొన్నాళ్లు భరించిన అతడు.. తర్వాత ఆలోచనలో పడ్డాడు.

భర్తను వదిలి తల్లిదండ్రుల వద్ద ఉంటూ.. ఇటీవల ఆస్పత్రికి వెళ్లి ఆమె చేసిన నిర్వాకం.. భర్తకు తెలియడంతో..

క్రమక్రమంగా భార్యతో ఈ విషయంపై గొడవ పడేవాడు. మొదట తమాషాగా అంటున్నాడులే.. అని సరిపెట్టుకున్న యువతికి చివరికి విషయం అర్థమైంది. ప్రేమించే ముందు నేను ఎస్సీ వర్గం అని తెలీదా.. అంటూ ఎదురు ప్రశ్నించింది. అలాంటప్పుడు నా దగ్గరికి రావద్దంటూ దూరం పెట్టింది. ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఓ రోజు భార్యపై దాది చేయడంతో తీవ్రంగా గాయపడింది. కొన్నాళ్ల తర్వాత తన పుట్టింటికి వెళ్లింది. పెద్దల సలహాతో గత్లోడియా పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వదినను ఏకాంతంగా కలిసిన మరిది.. మద్యం మత్తులో అతడు చెప్పిన ఒక్క మాటతో.. తెల్లవారుజామున లేచి చూస్తే..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

గుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన తల్లి.. ఈ ఏడేళ్ల కొడుకు చేసిన పనేంటో తెలిసి అవాక్కైన డాక్టర్లు..!భార్య ప్రియుడితో వెళ్లిపోయిందనే కోపంతో.. కూతురును అడ్డుపెట్టుకుని అతడు వేసిన ప్లాన్.. విచారణలో విస్తుపోయే నిజాలుపెళ్లిరోజున భార్యపై ప్రేమ చూపించాల్సింది పోయి.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతడు చెప్పిన మాట.. చివరకు అంతా షాక్..వారిద్దరూ డాక్టర్లు.. సహజీవనం తర్వాత పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకోని పెద్దలు.. ఆ ఒక్క కారణంతో..భర్త వేరే ఇంటికి వెళ్లడాన్ని గమనించిన భార్య.. ఓ రోజు స్కూల్‌కి వెళ్లి రిజిస్టర్‌లో చూడగా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..చాలా ఏళ్లుగా యువతిపై వన్‌సైడ్ లవ్.. కాబోయే భర్తతో ప్రియురాలు ఫోన్‌లో మాట్లాడుతుండడం చూసి.. వెనుకే వెళ్లి..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.