ఇంటింటి సర్వే ముమ్మరం

ABN , First Publish Date - 2021-09-15T04:17:19+05:30 IST

సంగారెడ్డి జిల్లాలోని పురపాలికల్లో చేపట్టిన ఇంటింటి సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది.

ఇంటింటి సర్వే ముమ్మరం

పురపాలికల్లో పక్కాగా తేలనున్న ఆస్తి పన్ను లెక్క

భువన్‌ యాప్‌లో భవనాల వివరాల నమోదు

ప్రతి ఇంటికీ జియో ట్యాగింగ్‌

సర్వే ద్వారా అసెస్‌మెంట్‌ సమస్యకు చెక్‌!


 సంగారెడ్డి టౌన్‌, సెప్టెంబరు 14 : సంగారెడ్డి జిల్లాలోని పురపాలికల్లో చేపట్టిన ఇంటింటి సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ సర్వే ద్వారా ఆస్తిపన్ను లెక్కలు పక్కాగా తేలనున్నాయి. అయితే కొన్నేళ్లుగా పాత ఆస్తిపన్నులనే చెల్లిస్తున్న ఇళ్ల, వాణిజ్య భవనాల యజమానులకు మరింత భారం కానున్నది. గతనెల 10 నుంచి ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోల్‌-జోగిపేట, అమీన్‌పూర్‌, తెల్లాపూర్‌, ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీల పరిధిలోని  అన్నిగృహాలు, వాణిజ్య, వ్యాపార కేంద్రాలతో పాటు అపార్ట్‌మెంట్లకు సంబంధించి కొలతలను నమోదుచేస్తున్నారు. బల్దియాలోని బిల్‌ కలెక్టర్లు ఇతర సిబ్బంది బృందాలుగా ఏర్పడి రోజుకు 50 నుంచి 100 గృహాల కొలతలు చేస్తూ అక్కడికక్కడే భువన్‌యా్‌పలో నమోదు చేస్తున్నారు. 


పెరగనున్న ఆస్తి పన్ను

 ఐదేళ్లకొకసారి ఇంటి కొలతలు, అంతస్తుల వివరాలను సేకరించి ఆస్తి పన్ను ను నిర్ధేశించాల్సి ఉండగా 2010 నుంచి ఈ ప్రక్రియ జరగలేదు. ప్రస్తుత సర్వే ద్వారా 2022 ఆర్థిక సంవత్సరం నుంచి ఆస్తి పన్ను పెరగనున్నట్లు తెలిసింది. 


18 నెలల తర్వాత ప్రారంభమైన సర్వే

పట్టణాల్లోని గృహ సముదాయాలతో పాటు వాణిజ్య భవనాలకు జియో ట్యాగింగ్‌ చేసి ఆస్తి పన్ను ఖరారు చేయాలన్న ఉద్దేశంతో 2019లో రాష్ట్ర ప్రభుత్వం భువన్‌యా్‌పను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో మున్సిపాలిటీల పరిధిలోని ఇళ్ల వివరాలను కొంత మేర సేకరించారు. కరోనా విజృంభించడంతో సర్వేను నిలిపివేశారు. దాదాపు 18 నెలల క్రితం నిలిచిపోయిన ఇంటింటి సర్వే మళ్లీ ప్రారంభమైంది. పట్టణాల్లోని ప్రతి ఇంటి వివరాలను సేకరించి భువన్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో సర్వే చేస్తున్నారు. జిల్లాలోని సంగారెడ్డి గ్రేడ్‌వన్‌ మున్సిపల్‌తో పాటు సదాశివపేట, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోల్‌-జోగిపేట, అమీన్‌పూర్‌, ఐడిఎ బొల్లారం, తెల్లాపూర్‌ పురపాలికల పరిధిలో ఉన్న ప్రతి ఇంటి వివరాలను సేకరిస్తున్నారు. 


తీరనున్న డబుల్‌అసెస్‌మెంట్ల సమస్య

 పట్టణాల్లో మున్సిపల్‌ సిబ్బంది చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా డబుల్‌ అసెస్‌మెంట్ల లెక్క తేలనున్నది. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో లెక్కకు మించి డబుల్‌ అసె్‌సమెంట్లు (రెండు ఆస్తిపన్నులు) ఉండడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఒకే ఇంటిపై రెండు ఆస్తి పన్నులు ఉండడంతో ఇంటి యజమానుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్నది. 

 జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో అధికారిక లెక్కల ప్రకారం..20,191 గృహ సముదాయాలు, 227 ప్రభుత్వ భవనాలు, 212 ప్రైవేట్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటిపై ప్రతి ఏటా ఆస్తి పన్ను రూపంలో రూ.10.96 కోట్ల ఆదాయం వస్తున్నది. పట్టణంలో అదనంగా దాదాపు 6వేల గృహ సముదాయాలకు సంబంధించి డబుల్‌ అసె్‌సమెంట్లు ఉన్నట్టు అంచనా వేశారు. మంజీరానగర్‌లోని ఓ ఇంటి ఆస్తి పన్నును ప్రతి ఏటా క్రమం తప్పకుండా చెల్లిస్తున్నప్పటికీ డబుల్‌ అసె్‌సమెంట్‌ (డబుల్‌ ఇంటి నంబర్‌) కారణంగా రూ.70వేల బకాయి ఉన్నట్ట్టు ఆన్‌లైన్‌లో చూపిస్తున్నది. ఈ లెక్కన పట్టణంలో 6 వేల గృహ సముదాయాలపై డబుల్‌  అసె్‌సమెంట్‌ ఉండగా రూ.3కోట్ల బకాయిలు ఉన్నట్లుగా ఆన్‌లైన్‌లో చూపెడుతున్నది. డబుల్‌ అసె్‌సమెంట్లు సమస్య జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఉన్నట్టు అధికారవర్గాలు పేర్కొన్నాయి.  ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ద్వారా డబుల్‌ అసె్‌సమెం ట్ల లెక్కను తేల్చి ఆన్‌లైన్‌ నుంచి తొలగించనున్నారు.



Updated Date - 2021-09-15T04:17:19+05:30 IST