వానల్లో ఇల్లు చెక్కుచెదరకుండా...

ABN , First Publish Date - 2020-09-16T04:49:16+05:30 IST

ఈ సీజన్‌లో ఇంటి గోడలు, మిద్దె మీద ఏర్పడిన పగుళ్ల నుంచి నీళ్లు కారడం, ఇల్లంతా తేమగా మారడం ఇబ్బందిగా అనిపిస్తుంది.

వానల్లో ఇల్లు చెక్కుచెదరకుండా...

ఈ సీజన్‌లో ఇంటి గోడలు, మిద్దె మీద ఏర్పడిన పగుళ్ల నుంచి నీళ్లు కారడం, ఇల్లంతా తేమగా మారడం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా జరగకుండా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలోనూ నిశ్చింతంగా ఉండొచ్చు. అవేమిటంటే...


 వర్షం పడుతున్నప్పుడు కిటికీలు, బాల్కనీ గుండా నీరు ఇంట్లోకి చేరుతుంది. తలుపులు, కిటికీలు మూసినా కూడా నీరు వస్తుంది. అప్పుడు వాటి మీద టార్పలిన్‌ కవర్‌ కప్పి ఉంచితే నీళ్లు ఇంట్లోకి రావు. 


 కలపతో చేసిన తలుపులు వానకు తడిసి బిగుసుకుపోతాయి. ఒక్కోసారి వాటి నట్లు సరిగ్గా బిగించకపోయినా ఈ సమస్య వస్తుంది. అలాంటప్పుడు వార్నిష్‌ చేయడం లేదా సాండ్‌పేపర్‌ ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. లేదంటే ఒకసారి ఆ తలుపులను ఊడదీసి, తిరిగి ఫిట్‌ చేయాలి.


 ఎలక్ట్రిక్‌ స్విచ్‌ బోర్డులు, వైర్లు సరిగ్గా పనిచేయకపోవడం వర్షాకాలంలో ఎక్కువగా చూస్తుంటాం. అలా జరగకుండా నాణ్యమైన వైర్లను ఉపయోగించాలి. వైర్లను పూర్తిగా కప్పి వేయడం వల్ల భద్రతతో పాటు ఇంటి అలంకరణలో కొత్తదనం కనిపిస్తుంది. ప్రతి పవర్‌బోర్డుకు విడిగా ఫ్యూజ్‌ ఉండాలి. 


 కబోర్డులు, సొరగుల్లో కీటకాలు, తేమ వల్ల గోడల మీద నాచు పెరగడం ఈ సీజన్‌లో మరీ ఎక్కువ. కంఫర్‌ బిళ్లలు, వేప ఆకులు, లవంగాలను కబోర్డుల్లో ఉంచితే కీటకాలు, పురుగుల బెడద తప్పుతుంది.


Updated Date - 2020-09-16T04:49:16+05:30 IST