వీరుల చరిత్రను భావితరాలకు చేరవేయాలి

ABN , First Publish Date - 2022-08-11T05:43:33+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలోనైనా దేశ, సాంస్కృతిక, వీరుల అసలైన చరిత్రను భావితరాలకు చేరవేయాలని ఆర్‌ఎ్‌సఎస్‌ తెలంగాణ ప్రాంత సహ కార్యవాహ అన్నదానం సుబ్రహ్మణ్యం అన్నారు.

వీరుల చరిత్రను భావితరాలకు చేరవేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌ఎ్‌సఎస్‌ సహ కార్యవాహ సుబ్రహ్మణ్యం

వీరుల చరిత్రను భావితరాలకు చేరవేయాలి

ఆర్‌ఎ్‌సఎస్‌ సహ కార్యవాహ సుబ్రహ్మణ్యం 

భువనగిరి టౌన్‌, ఆగస్టు 10: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలోనైనా దేశ, సాంస్కృతిక, వీరుల అసలైన చరిత్రను భావితరాలకు చేరవేయాలని ఆర్‌ఎ్‌సఎస్‌ తెలంగాణ ప్రాంత సహ కార్యవాహ అన్నదానం సుబ్రహ్మణ్యం అన్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం భువనగిరిలో నిర్వహించిన రక్షాబంధన్‌ ఉత్సవంలో ఆయన మాట్లాడారు. గత పాలకులు, స్వయం ప్రకటిత మేథావులు దేశచరిత్రను వక్రీకరించారని, ఫలితంగా మన గొప్పతనం నేటికీ బాహ్య ప్రపంచానికి తెలియదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నూతన జాతీయ విద్యావిధానంతో మన వైభవం ప్రజ్వరిల్లనుందన్నారు. రక్షాబంధన్‌ స్ఫూర్తితో మహిళలపై హింసను వీడాలని, సాంఘిక దురాచారాలను తరిమికొట్టాలన్నారు. 2025తో ఆర్‌ఎ్‌సఎస్‌ స్థాపించి వందేళ్లు పూర్తి కానుందని, ఈ సందర్భం గా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఎ్‌సఎస్‌ జిల్లా సంఘచాలక్‌ బాదం ప్రకాశ్‌, శ్రీనివాస్‌, డాక్టర్‌ ఈశ్వర్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-11T05:43:33+05:30 IST