ఏపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడిన హైకోర్టు

ABN , First Publish Date - 2021-08-10T02:42:35+05:30 IST

ఏపీ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు మండిపడింది. కోర్టు ధిక్కారం కేసులో నలుగురు ఐఏఎస్‌లు

ఏపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడిన హైకోర్టు

అమరావతి: ఏపీ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు మండిపడింది. కోర్టు ధిక్కారం కేసులో నలుగురు ఐఏఎస్‌లు హాజరయ్యారు. పంచాయితీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దివ్వేది, కమిషనర్‌ గిరిజా శంకర్, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీలక్ష్మీ, ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ కోర్టుకు హాజరయ్యారు. పాఠశాలల భవనాల్లో రైతు భరోసా, పంచాయితీ భవనాలు, గ్రామ సచివాలయ నిర్మాణాలపై కోర్టు ధిక్కారణ కేసు విచారణ జరుగుతోంది. స్కూల్‌ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని హైకోర్టు పేర్కొంది.


పేద పిల్లలు చదువుకునే స్కూల్స్‌లో వాతావరణ కలుషితం చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీలో ఏవరైనా ఈ పాఠశాలల్లో చదువుకున్నారా అని హైకోర్టు జడ్జి దేవానంద్‌ ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా నిర్మాణాలు ఎందుకు కొనసాగుతున్నాయని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలల ఆవరణలోకి రాజకీయాలను ఎలా తీసుకెళ్తారని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది. ఆగస్టు 31న కూడా అధికారులంతా హాజరుకావాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నివేదిక ఇస్తామని ఏజీ తెలిపారు. 


Updated Date - 2021-08-10T02:42:35+05:30 IST